Tuesday, June 16, 2026
Homeసినిమాసెప్టెంబర్ 29న వస్తున్న పెదకాపు

సెప్టెంబర్ 29న వస్తున్న పెదకాపు

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1. ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్. పెదకాపు-1ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విరాట్ యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో… మిగతా వారు చేతిలో ఆయుధాలతో కనిపించారు.

రానున్న రోజుల్లో ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం పెదకాపు-1.  ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular