Tuesday, June 16, 2026
HomeసినిమాAla Ninnu Cheri: క్రిష్ చేతుల మీదుగా ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ రిలీజ్

Ala Ninnu Cheri: క్రిష్ చేతుల మీదుగా ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ రిలీజ్

నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో ‘అలా నిన్ను చేరి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను జనానికి చేరువ చేసే దిశగా బెస్ట్ ప్రమోషన్స్ చేపడుతున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్,మోషన్ పోస్టర్, గ్లింప్స్‌, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. అదే బూస్టింగ్ తో ఇప్పుడు అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా తాజాగా ఈ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ మొత్తాన్ని క్రిష్ అభినందించారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టు అద్భుతమైన విజువల్స్ లో షూట్ చేసిన ఈ పాటకు మంచి స్పందన వస్తుందని అన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు డైరెక్టర్ క్రిష్.

ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. సుభాష్‌ ఆనంద్ బాణీలు కట్టారు. ఎంతో ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నాయి. హీరో హీరోయిన్ దినేష్ తేజ్, పాయల్ రాధాకృష్ణ అద్భుతమైన కెమిస్ట్రీ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలో సుభాష్‌ ఆనంద్ బాణీలు ఎంతో మనోహరంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular