తెలంగాణలో ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 7ని రిపోర్టింగ్ గడువుగా మొదట నిర్ణయించారు. గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి రిపోర్టింగ్ గడువును పెంచాలని మెడికల్ కౌన్సిల్ కమిటీ(ఎంసీసీ) నిబంధనల ప్రకారం మూడో విడత కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించాలని లేకపోతే తెలంగాణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని వివరించారు.
స్పందించిన మంత్రి అభ్యర్థుల వినతిని పరిగణలోకి తీసుకొని రెండో విడత అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతిని ఆదేశించారు. ఈమేరకు రెండో విడత కౌన్సెలింగ్ లో సీటు సాధించిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువును సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు పెంచుతూ సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయింపు జరిపిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలియజే.. మూడో విడుత కౌన్సెలింగ్ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.