Saturday, November 23, 2024
HomeTrending NewsTTD: టిటిడి మహాశాంతి వరుణ యాగం

TTD: టిటిడి మహాశాంతి వరుణ యాగం

 రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని  శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ శ్రీనివాస అష్టోత్తర శత కుండాత్మక మహాశాంతి వరుణ యాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తోంది. ఈ యాగంలో టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి  పాల్గొన్నారు.  శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య ఆశీస్సులతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రజలందరికీ మంచి జరగాలన్న సత్సంకల్పంతో వరుణ యాగం తలపెట్టామని, ఈనెల 11వ తేదీన పూర్ణాహుతితో ముగుస్తుందని భూమన తెలిపారు.

నెల క్రితం కొండ మీద నిర్వహించిన వరుణ యాగం వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డాయని, అయితే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ అధికారులు హెచ్చరిక నేపథ్యంలో ఈ యాగం నిర్వహిస్తున్నామని భూమన వివరించారు.  గతంలో ఎన్నడూ ఈ తరహాలో యాగం జరగలేదన్నారు.

మూడు రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా వేద పండితులు, 215 మందికి పైగా రుత్వికులు ఈ హోమం జరిపిస్తున్నారని, దీనివల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందని భూమన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్