Thursday, March 12, 2026
Homeసినిమా‘శాకుంతలం’ సెట్ లో.. పుష్పరాజ్

‘శాకుంతలం’ సెట్ లో.. పుష్పరాజ్

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక ప్రేమగాధ శాకుంతలం. మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల – దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీతోనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ వెండితెర అరంగేట్రం చేస్తోంది. ‘శాకుంతలం’ లో అల్లు అర్హ.. ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తన ముద్దుల కూతురు అర్హ శాకుంతల సినిమా ద్వారా వెండితెర పై ఎంట్రీ ఇస్తుండడడంతో బన్నీ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే.. ఈరోజు శాకుంతలం సెట్ ని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించి యూనిట్ సభ్యులను సర్ ఫ్రైజ్ చేశారు. సెట్ కి వచ్చిన అల్లు అర్జున్ కి డైరెక్టర్ గుణ శేఖర్ మరియు నిర్మాత నీలిమ గుణ బొకేతో స్వాగతం పలికారు. యూనిట్ సభ్యులందరితో అల్లు అర్జున్ ఇంట్రాక్ట్ అయ్యారు. అలాగే అల్లు అర్హకు సంబంధించిన సన్నివేశాలను చూసి.. శాకుంతలం చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటుగా భార్య స్నేహ, కుమారుడు అల్లు అయాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శాకుంతలం టీమ్ కి స్టైలీష్ స్టార్ శుభాకాంక్షలు తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular