Sunday, September 22, 2024
HomeసినిమాAtlee: అట్లీ నెక్ట్స్ మూవీ హీరో ఎవరు..?

Atlee: అట్లీ నెక్ట్స్ మూవీ హీరో ఎవరు..?

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విభిన్న కథా చిత్రాలు చేస్తూ సక్సెస్ సాదిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తో అట్లీ తెరకెక్కించిన మూవీ ‘జవాన్’. ఈ సినిమా అంచనాలకు మంచి సక్సెస్ సాధించింది. సరికొత్త రికార్డుల దిశగా జవాన్ దూసుకెళుతుంది. అయితే.. అట్లీ నెక్ట్స్ మూవీ హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. గత కొన్ని రోజులు నుంచి అట్లీ.. అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం గురించి అట్లీని మీడియా అడిగితే.. బన్నీకి కథ చెప్పాను. కథాచర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు.

అయితే.. జవాన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. షారుఖ్ అట్లీతో మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. దీంతో అట్లీ జవాన్ సీక్వెల్ చేస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త కోలీవుడ్, బాలీవుడ్ లో బాగా ప్రచారంలో ఉంది. బన్నీ మాత్రం.. అట్లీతో సినిమా చేయడం గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. దీనిని బట్టే అట్లీ నెక్ట్స్ ఏంటి అనేది ఆధారపడి ఉంటుందని తెలిసింది. పుష్ప రాజ్ ఓకే అంటే సరే.. లేకపోతే షారుఖ్ తోనే సినిమా చేయాలనే ఆలోచనలో అట్లీ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అట్లీ నెక్ట్స్ మూవీ హీరో ఎవరు అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్