Wednesday, June 17, 2026
HomeసినిమాUstaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' మళ్లీ ఆగిందా..?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మళ్లీ ఆగిందా..?

పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈసారి ఎలాగైనా సరే.. అభిమానులు కోరుకుంటున్నట్టుగా అదిరిపోయే మూవీ అందించాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే.. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ను పక్కనపెట్టి.. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల షూటింగ్స్ కు డేట్స్ ఇచ్చారు. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల పవన్ పై చిత్రీకరించిన సీన్ కు సంబంధించిన పిక్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ నేపధ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయలేని పరిస్థితి. పొలిటికల్ గా బిజీ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కు మళ్లీ బ్రేక్ పడిందా అనేది ఆసక్తిగా మారడంతో ఉస్తాద్ వార్తల్లో నిలిచాడు.

తాజా అప్ డేట్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ పడలేదట. పవర్ స్టార్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇందులో శ్రీలీల, సాక్షి వైద్య నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్.. ఓజీ షూటింగ్ లో పాల్గొనాలి అనుకున్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కావాలి అనేది ప్లాన్. అయితే.. పవన్ మళ్లీ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతారో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular