Thursday, June 18, 2026
HomeసినిమాRajinikanth: రజనీ రూటే సెపరేటు .. రంగంలోకి లోకేశ్ కనగరాజ్! 

Rajinikanth: రజనీ రూటే సెపరేటు .. రంగంలోకి లోకేశ్ కనగరాజ్! 

రజనీకాంత్ .. ఈ పేరుకి ఉన్న పవర్ గురించి .. ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. ఒకప్పుడు కోలీవుడ్ నుంచి రజనీ సినిమా దండయాత్ర మొదలుపెట్టిందంటే, బాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ డేట్లు వాయిదా వేసుకునేవి. అంతగా రజనీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా చాటుకునేవి. ఇప్పుడు కూడా రజనీ సత్తా ఎంతమాత్రం తగ్గలేదు. మార్కెట్ విషయంలోనూ .. తన సినిమాలకి సంబంధించిన వసూళ్ల విషయంలోను ఆయన పోటీపడుతూనే ఉన్నారు. అందుకు నిదర్శనంగా రీసెంట్ గా రిలీజైన ‘జైలర్’ కనిపిస్తూనే ఉంది.

అలాంటి రజనీ తన 171వ సినిమా కోసం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇప్పుడు కోలీవుడ్ అందరూ మాట్లాడుకునే పేరు లోకేశ్ కనగరాజ్. విజయ్ కి ‘మాస్టర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆయన, విజయ్ తోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యలో కమల్ కి ‘విక్రమ్’తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. కమల్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా హిట్ టాక్ రాగానే కమల్ దగ్గరుండి మరీ లోకేశ్ ను తీసుకెళ్లి రజనీకి పరిచయం చేశారు.

అప్పటి నుంచి రజనీ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అయింది. రజనీ 171వ సినిమాను లోకేశ్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ‘కబాలి’ నుంచి రజనీ తన లుక్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. కొత్తగా కనిపించడంలో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఈ సినిమాలో కూడా రజనీని లోకేశ్ డిఫరెంట్ లుక్ తో చూపించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular