ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, దీనిలో భాగంగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. జగనన్న సురక్ష తరహాలోనే జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలని, సురక్షలో ఏ రకంగా వారి సమస్యలను పరిష్కరించి సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికేట్లు నెల రోజుల వ్యవధిలో అందించామో… అదే తరహాలో దీన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్యసురక్ష పై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్ ను సిఎం విడుదల చేశారు.
వాలంటీర్లు, గృహసారధులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటినీ సందర్శించి ఈ కార్యక్రమం చేయబోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరించి ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కలిగించే ప్రయత్నం కూడా చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎంఫానెల్ అయిన ఆసుపత్రుల వివరాలు, పథకాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కలిగించాలన్నారు.
అధికారులకు సిఎం చేసిన సూచనలు:
- ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి.
- దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది.
- 7 రకాల టెస్టులు… బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్ టెస్టుతో పాటు (ఉమ్మి) స్పూటమ్ టెస్ట్, మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
- మొబైల్ యాప్‌లో ఇలా సేకరించిన డేటాను అప్‌డేట్ చేస్తారు. ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ కూడా జనరేట్ అవుతుంది.
- ఫేజ్ –3లో మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది.
- హెల్త్ క్యాంప్ జరగబోయే 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్, ఏఎన్‌ఎం, ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆ గ్రామంలో మరోసారి గుర్తు చేస్తారు.
- ఫేజ్ 4లో… హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు.
- ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్ క్యాంపు ఉంటుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. రూరల్, అర్భన్ ఏరియాలోనూ ఈ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు.
- ఆయ గ్రామాల్లో…ఎంపీడీఓ, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణా బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
- హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
- ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత…. క్యాంపు నిర్వహించిన రోజు వారికి అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు…అవసరమైన మందులు కూడా ఇవ్వాలి. మందులు లేవు అన్న మాట వినిపించకూడదు.
- ఆరోగ్యశ్రీ మీద అవగాహన కలిగించాలి. మొబైల్ యాప్‌లో డౌన్లోడ్ చేయడం ఎలా అన్న అంశాలతోపాటు… ఎలా వినియోగించుకోవాలన్న దానిపై కూడా అవగాహన కలిగించాలి.
- ఈ కార్యక్రమం కూడా కచ్చితంగా జగనన్న సురక్ష తరహాలో విజయవంతం అవుతుంది.
- ఆరోగ్యపరంగా వారిని సురక్షంగా ఉంచే కార్యక్రమమే ఆరోగ్య సురక్షా కార్యక్రమం.
- ఎవరికి ఇందులో ఎలాంటి అనుమానాలున్నా…. సీఎంఓతో నివృత్తి చేసుకొండి.
- గతంలో ఈ తరహా కార్యక్రమం ఎప్పుడూ జరగలే దు.
- ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలి.