Friday, October 18, 2024
HomeసినిమాAtlee: అట్లీ భారీ ప్లాన్ ఇదే

Atlee: అట్లీ భారీ ప్లాన్ ఇదే

షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన భారీ, క్రేజీ చిత్రం ‘జవాన్’. ఈ భారీ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. షారుఖ్ ఖాన్ ను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా చాలా కొత్తగా.. పవర్ ఫుల్ గా చూపించేసరికి నార్త్ ఆడియన్స్ కి జవాన్ మూవీ విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా దాదాపు 800 కోట్లతో దూసుకెళుతుంది. అయితే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అట్లీ పేరు మ్రోగుతుంది. దీంతో అట్లీ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

అల్లు అర్జున్ తో అట్లీ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి కానీ.. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నాడు. ఆతర్వాత అట్లీతో సినిమా అంటే.. చాలా టైమ్ పడుతుంది. అందుకనే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. అది భారీ మల్టీస్టారర్ అని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే… బాలీవుడ్ స్టార్, కోలీవుడ్ స్టార్ కాంబోలో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్, కోలీవుడ్ స్టార్ ఎవరంటే.. షారుఖ్ ఖాన్, విజయ్ అని తెలిసింది. జవాన్ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. ఇది గ్యాసిప్ గానే మిగిలిపోయింది. తాజాగా ఈ గ్యాసిప్ గురించి అట్లీ స్పందించాడు. ఆయన ఏమన్నాడంటే.. విజయ్ నాకు బ్రదర్ లాంటివాడు. మేమిద్దరం కలిసి మూడు సినిమాలు చేశాం. గెస్ట్ రోల్ కాదు.. షారుఖ్, విజయ్ కాంబో మూవీ కోసం కథ ఆలోచిస్తున్నాను. అలాంటి కథ కుదిరినప్పుడు ఇద్దరితో కలిసి సినిమా చేస్తానని చెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే.. 1500 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేశాడు. దీనిని బట్టి అట్లీ పెద్ద ప్లానే వేశాడు. మరి.. ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్