Tuesday, June 16, 2026
HomeసినిమాSudheer Babu: సుధీర్ ను మార్చేసిన హంట్ మూవీ. మరి.. మామా మశ్చీంద్ర..?

Sudheer Babu: సుధీర్ ను మార్చేసిన హంట్ మూవీ. మరి.. మామా మశ్చీంద్ర..?

సుధీర్ బాబు కెరీర్ బిగినింగ్ నుంచి ఛాలెంజ్ లు స్వీకరిస్తూ వస్తున్నారు. తొలి సినిమాలో సుధీర్ బాబు వాయిస్ విన్న జనాలు అదేంటి వాయిస్ అలా ఉందేంటి అని షాక్ అయ్యారు. తన వాయిస్ పై వచ్చిన విమర్శలకు కృంగిపోలేదు. ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎంతో పట్టుదలతో ఇంకా చెప్పాలంటే.. కసితో పని చేశాడు. అందుకే ఆతర్వాత మార్పు కనిపించింది. ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలను అందించాలని తపిస్తున్న సుధీర్ బాబు ఆమధ్య హంట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది.

హంట్ సినిమా పై సుధీర్ బాబు చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన ఇంట్లో వాళ్లకి కూడా నచ్చలేదట. ఇంకా చెప్పాలంటే.. హంట్ మూవీ తనకు ఓ గుణపాఠం నేర్పిందని సుధీర్ బాబు ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. ఇక పై ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటానని.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని.. కొత్తదనం అందించాలనే ప్రయత్నంలో హంట్ లాంటి ప్రయోగాలు చేయడం తప్పని తెలుసుకున్నాను అన్నారు.

అంతే బాగానే ఉంది కానీ.. ఇప్పుడు సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘మామా మశ్చీంద్ర‘. ఈ సినిమాలో సుధీర్ బాబు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పాత్రలు పోషించాడు. అంటే.. త్రిపాత్రాభినయం చేసాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 6న విడుదల కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయి. అయితే.. మామా మశ్చీంద్ర సుధీర్ బాబు మరో హంట్ అవుతాదా..? లేక మరచిపోలేని విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: Mama Mascheendra: మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular