Thursday, March 19, 2026
HomeసినిమాVijay Deverakonda: విజయ్ సినిమా రెండు పార్టులుగా రానుందా..?

Vijay Deverakonda: విజయ్ సినిమా రెండు పార్టులుగా రానుందా..?

ఒక కథను ఒకే సినిమాగా తీసేవారు ఒకప్పుడు.. ఒక కథను రెండు పార్టులుగా తీస్తున్నారు ఇప్పుడు. ఇదే ఇప్పుడు ట్రెండ్. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరూ రెండు పార్టులుగా తీయాలి అనుకుంటున్నారు. బాహుబలి చిత్రం రెండు పార్టులుగా వచ్చి సంచలన విజయం సాధించడంతో ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. పుష్ప రెండు పార్టులు, కేజీఎఫ్ రెండు పార్టులు, ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉందని ప్రకటించారు. చంద్రముఖి 2 వచ్చింది.. స్కంద 2 ఉందని ప్రకటించారు. పెదకాపు పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ టు ఉందని అనౌన్స్ చేశారు. ఇలా స్టార్ హీరో, యంగ్ హీరో అనే తేడా లేకుండా అందరూ సీక్వెల్స్ అంటున్నారు.

అందుకనే అనుకుంటా..  హీరో విజయ్ దేవరకొండ సినిమాను కూడా రెండు పార్టులుగా చేయాలి అనుకుంటున్నారట. ఇంతకీ ఏ సినిమా అంటే.. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో విజయ్ కు జంటగా శ్రీలీలను ఫైనల్ చేశారు. అయితే.. ఆమె డేట్స్ సెట్ కాకపోవడంతో రష్మికను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి కానీ.. శ్రీలీలను ఇందులో నటిస్తుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన యువకుడి కథను గౌతమ్ తిన్ననూరి చూపించబోతున్నారట.

అయితే.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించాలి అనుకుంటున్నారట. కొన్ని సినిమాలు సక్సెస్ అయితే.. రెండో పార్ట్ ను అనౌన్స్ చేస్తున్నారు. మరి కొన్ని సినిమాలు సక్సెస్ తో సంబంధం లేకుండా ముందుగానే రెండు పార్టులు అని ప్రకటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా చేయనున్నట్టుగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే విజయ్ చేస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఇదే అవుతుంది. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి.. ఈ మూవీతో విజయ్ ఆశించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular