Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP Meeting: ఎన్నికలకు సమాయాత్తం చేసేందుకే...

YSRCP Meeting: ఎన్నికలకు సమాయాత్తం చేసేందుకే…

తమ ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళుతూ, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే సోమవారంనాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. మండలస్దాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ ప్రతినిధులందరూ ముఖ్యమంత్రితో ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనున్న విజయవాడలోని ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను  మంత్రి జోగి రమేష్,పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డిలతో కలిసి సజ్జల నేడు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షం, ఎల్లోమీడియా ప్రభుత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఇప్పటికే పార్టీపరంగా చేస్తున్న అంశాలను మరింతగా ఎలా పదును ఎక్కించాలనే అంశాలపై సిఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు విప్లవకారుడు, దేశభక్తుడులాగా చూపించుకునే ప్రయత్నాలను ఎలా ఎండగట్టాలనే దానిపై కూడా రేపు ముఖ్యమంత్రి  ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు రానున్న తరుణంలో ఈ సమావేశం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని, అందుకే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని సజ్జల తెలియచేశారు.

జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికీ అనేక పౌరసేవలు అందాయని,  ప్రస్తుతం జగనన్న ఆరోగ్యసురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని దీని ద్వారా విస్తృత  స్దాయిలో ఆరోగ్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ  రాష్ట్రంలో పేదల జీవితాలను మలుపు తిప్పి వారి కుటుంబాలలో వెలుగులు నింపే కార్యక్రమాలని కొనియాడారు.  ఆరోగ్యసేవలు ఖరీదైపోయిన ఈరోజులలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉందని, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్,స్పెషలిస్ట్ డాక్టర్ తో అనుసంధానం చేస్తూ అందులో భాగంగానే ఆరోగ్యసురక్ష తీసుకు వచ్చారు. ధనవంతులకు మాత్రమే పరిమితమైన,కార్పోరేట్ ఆస్పత్రుల సేవలు పేదల ఇళ్లకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమం గురించి  జగన్ రేపటి సమావేశంలో మరింతగా వివరిస్తారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్