Sunday, June 14, 2026
HomeసినిమాAkkineni Nagarjuna: మళ్లీ తెర పైకి నాగార్జున 100వ చిత్రం

Akkineni Nagarjuna: మళ్లీ తెర పైకి నాగార్జున 100వ చిత్రం

అక్కినేని నాగార్జున 100వ చిత్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. ప్రస్తుతం నాగార్జున 99వ చిత్రం ‘నా సామి రంగ‘ చేస్తున్నారు. అయితే.. నాగ్ వందో చిత్రం కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాతో ఉంటుందని.. ఇందులో అఖిల్ గెస్ట్ రోల్ చేయనున్నారని టాక్ వచ్చింది కానీ.. మోహన్ రాజాతో చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందట. మరి.. నాగ్ వందో చిత్రం ఎవరితో అంటే.. కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో అని టాక్ బలంగా వినిపిస్తోంది. నవీన్ తమిళ్ లో అగ్ని సిరుగుగల్ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా బాగా నచ్చడం.. అలాగే నవీన్ చెప్పిన స్టోరీ కూడా నచ్చడంతో నాగ్ ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారని తెలిసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఊపిరి సినిమా చేసినప్పటి నుంచి నాగార్జున, కార్తీ అన్నదమ్ముల వలే కలిసిపోయారు. ఇంకా చెప్పాలటే.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అందుచేత నాగ్ దగ్గరకు ఈ డైరెక్టర్ ను పంపించిందే కార్తీ అని సమాచారం. స్టోరీ లైన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండడంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం నవీన్ ఫుల్ స్ట్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే నాగ్ 100వ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ 7 కు హోస్ట్ గా చేస్తున్నారు. నా సామి రంగ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని టీమ్ చాలా పట్టుదలగా వర్క్ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో ఈసారి కూడా నా సామి రంగ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు. అలాగే ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular