Sunday, March 8, 2026
Homeసినిమా'చిన్నా' వైపు నుంచి సిద్ధార్థ్ ఆశించిన రెస్పాన్స్ వచ్చినట్టేనా?

‘చిన్నా’ వైపు నుంచి సిద్ధార్థ్ ఆశించిన రెస్పాన్స్ వచ్చినట్టేనా?

సిద్ధార్థ్ హీరోగా తమిళంలో సెప్టెంబర్ 28వ తేదీన ‘చిత్తా’ సినిమా విడుదలైంది. సిద్ధార్థ్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంలో ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చింది. సిద్ధార్థ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకున్నారు. అదే రోజున తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధార్థ్ ప్రయత్నించాడు గానీ, థియేటర్లు దొరకలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను ‘చిన్నా’ పేరుతో ఇక్కడ విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యాడు కూడా. ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుందనీ, ఇలాంటి సినిమాను తాను మళ్లీ తీయలేకపోవచ్చని అన్నాడు. ఇలాంటి కంటెంట్ దొరకడమే కష్టమని చెప్పాడు. సిద్ధార్థ్ కి మార్కెట్ లేదు .. క్రేజ్ లేదు .. ఆయన సినిమాను ఎందుకు చూడాలి? అనుకునేవారి అభిప్రాయాలను ఈ సినిమా మారుస్తుందని బలంగా చెప్పాడు.

అయితే దాదాపు అరడజను సినిమాలతో కలిసి థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, సిద్ధార్థ్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయిందనే అనిపిస్తోంది. ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్టుగా ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో ఈ కథ ఆసక్తిని పెంచుతూ వెళుతుంది. నటన పరంగా సిద్ధార్థ్ ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమా ఇది. కథ మరీ కొత్తదికాకపోయినా, ట్రీట్మెంట్ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. కాకపోతే ఫస్టాఫ్ లో కథ మరీ స్లోగా సాగడమే అసంతృప్తిని కలిగిస్తుందనే మాట ఆడియన్స్ వైపు నుంచి వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular