Saturday, September 21, 2024
Homeసినిమానెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న 'కాలాపాని'

నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న ‘కాలాపాని’

మనిషి మనుగడకి ప్రధానమైన జీవనాధారం నీరు .. ఆ నీరు కలుషితమైపోతే .. అది అత్యంత విషపూరితంగా మారితే .. భయంకరమైన వైరస్ కి అది కేంద్రంగా మారితే .. ఆ నీరు త్రాగినవారికే కాకుండా, ఒకరి నుంచి ఒకరికి ఆ వైరస్ సోకితే ఎలా ఉంటుంది? కరోనా వైరస్ తరహాలో విలయతాండవం జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలు పడే అవస్థలు చెప్పడానికి మాటలు చాలవు. అలాంటి ఒక కంటెంట్ తో నెట్ ఫ్లిక్స్ లో ‘కాలాపాని’ వచ్చింది. ఈ నెల 18వ తేదీన స్ట్రీమింగ్ జరుపుకున్న ఈ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సిరీస్ కి సమీర్ సక్సేనా దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. అండమాన్ – నికోబార్ దీవుల పరిసర ప్రాంతాలను తన కథావస్తువు కోసం ఆయన ఎంచుకున్నాడు. అక్కడి ‘ఒరాకా’ అనే తెగకి చెందిన ఆదిమవాసుల జీవితాలను నాగరీకులతో లింక్ చేస్తూ ఈ కథను నడిపించాడు. కరోనా వైరస్ సమయంలో చాలామంది దగ్గరలో ఉన్న అడవుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆ సమయంలో అడవిలోని ఆదిమవాసులకు ఏమీ జరగలేదనే వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఏమిటి? వారి విశ్వాసాలు వారిని ఎలా కాపాడాయి? అనే అంశాలను దర్శకుడు ఈ సిరీస్ లో ప్రస్తావించాడు.

అండమాన్ – నికోబార్ ప్రాంతంలో వైరస్ విజృంభించాడానికి కారణాలు ఏమిటి? కొంతమంది స్వార్థపరులు ఈ విషయం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? మరికొంతమంది నిజాయితీ పరులు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టారు? అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆలోచింపజేస్తుంది. వైరస్ పుట్టడానికి దర్శకుడు చెప్పిన రీజన్ కూడా కనెక్ట్ అవుతుంది. వైరస్ విజృంభించే సమయానికి ప్రధానమైన పాత్రలు అన్ని వైపుల నుంచి ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. ఇక ఆ పాత్రలతో దర్శకుడు ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ ముందుకు తీసుకుని వెళ్లాడు. ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ సిరీస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్