Tuesday, June 16, 2026
Homeసినిమాబాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్..?

బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్..?

బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమాతో మరో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఇలా.. బాలయ్య కెరీర్ లో దూసుకెళుతుండడంతో నెక్ట్స్ చేసే సినిమాల పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మరింత ఆసక్తి ఏర్పడింది. తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆమధ్య ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ భారీ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురానున్నారు. అయితే.. బాలయ్యతో పాన్ ఇండియా డైరెక్టర్ క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారని వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరో కాదు.. పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన సుకుమార్ అని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సుకుమర్ పుష్ప 2 చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ ఆగష్టు 15న విడుదల కానుంది. ఆతర్వాత సుకుమార్ తెరకెక్కించే సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. బాలయ్యతో అని ఓ వార్త బయటకు వచ్చింది. ఈ కాంబోని ఎవరూ ఊహించలేదు.

సుకుమార్ చరణ్‌, విజయ్ దేవరకొండలతో సినిమాలు చేయాల్సివుంది. యంగ్ హీరోలతో కాకుండా సీనియర్ హీరో బాలయ్యతో సుకుమార్ సినిమా అంటే వినడానికి ఇంట్రస్టింగ్ గా ఉంది. నిజంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే సంచలనమే. మరి.. ఇది నిజంగా నిజం కానుందా..? లేదా అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular