Friday, March 13, 2026
Homeసినిమా'గుంటూరు కారం' గురించి సరికొత్త వార్త

‘గుంటూరు కారం’ గురించి సరికొత్త వార్త

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ‘గుంటూరు కారం‘. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే… ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఏదోక వార్త వస్తూనే ఉంది కానీ.. ఇప్పటి వరకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాలేదు. అతి త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దీపావళికి ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన కొత్త వార్త ఏంటంటే.. ఈ మూవీలో మహేష్‌ బాబు కనకదుర్గమ్మ భక్తుడుగా నటిస్తున్నాడట. అలాగే కనక దుర్గమ్మ గుడిలో వచ్చే సీన్ అయితే.. చాలా బాగుంటుందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందట. ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇందులో మహేష్‌ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

అక్టోబర్ కి టాకీ మొత్తం పూర్తవుతుందని.. సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉంటుందని ఆమధ్య నిర్మాత నాగవంశీ చెప్పారు కానీ.. డిసెంబర్ సెకండ్ వీక్ కి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. దీపావళికి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి అప్పటి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా… గుంటూరు కారం మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం.. సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయం అంటున్నారు మేకర్స్. మరి.. మహేష్‌, త్రివిక్రమ్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: Guntur Kaaram First Single: గుంటూరు కారం ప్లాన్ మారిందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular