Tuesday, March 17, 2026
Homeసినిమావిజయ్ మరో మూవీకి ఓకే చెప్పాడా..?

విజయ్ మరో మూవీకి ఓకే చెప్పాడా..?

విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల్లో కెరీర్ బిగినింగ్ లో మంచి పేరు తీసుకువచ్చిన చిత్రం ‘పెళ్లిచూపులు’. తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ సినిమా ఓ విభిన్న కథాంశంతో రూపొందింది. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుని విజయం సాధించింది. చిన్న సినిమాగా విడుదలైంది. పెద్ద విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా బిగ్ హిట్ సాధించింది. ఆతర్వాత విజయ్, తరుణ్ భాస్కర్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు.

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి సినిమా చేశాడు. ఆ సినిమా యూత్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. తరుణ్ భాస్కర్ అయితే.. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశాడు. ఇలా విజయ్, తరుణ్ ఇద్దరూ బాగా బిజీ అయ్యారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ మూడవ చిత్రంగా ‘కీడా కోలా’ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.

ఈ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ తో మరో సినిమా చేయాలి కానీ.. కుదరలేదు. ఒక కథ చెప్పాడు. ఆ కథ ఇద్దరికీ బాగా నచ్చింది. ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. త్వరలోనే విజయ్, తరుణ్ భాస్కర్ ని కలిసి చూస్తారని విజయ్ ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఆతర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ, ఆతర్వాత రవికిరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తైన తర్వాత విజయ్, తరుణ్ భాస్కర్ మూవీ ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular