Sunday, January 19, 2025
Homeసినిమావిదేశాల్లో విహరిస్తున్న 'కన్నప్ప' కథ! 

విదేశాల్లో విహరిస్తున్న ‘కన్నప్ప’ కథ! 

తెలుగులో బాపు దర్శకత్వంలో చాలా కాలం క్రితం వచ్చిన ‘భక్త కన్నప్ప’ సంచలన విజయాన్ని సాధించింది. కృష్ణంరాజు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆయన బ్యానర్ ను నిలబెట్టింది. అలాంటి కథతోనే మంచు విష్ణు ‘కన్నప్ప’ కథను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరుగుతోంది. 80 శాత్రం చిత్రీకరణను అక్కడ పూర్తిచేసుకొని రానున్నారు. అక్కడి ఫారెస్టు ప్రాంతంలోనే ఈ కథ అంతా కూడా నడుస్తుంది.

ఇంతవరకూ విష్ణు నిర్మిస్తూ వచ్చిన ప్రాజెక్టులు వేరు .. ఈ ప్రాజెక్టు వేరు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఒకే రోజున వివిధ భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. భారీ స్థాయిలో వీఎఫ్ ఎక్స్ ను ఉపయోగించనున్నారు. అంతేకాదు .. ముఖ్యమైన పాత్రల కోసం ఇతర భాషలకి చెందిన సీనియర్ స్టార్ హీరోలను రంగంలోకి దింపారు. ఇటీవల అనుసరిస్తూ వస్తున్న ఈ ఫార్మేట్, ‘విక్రమ్’ .. ‘జైలర్’ సినిమాలకు బాగా వర్కౌట్ అయింది.

ఇలా ‘కన్నప్ప’ సినిమాకి కూడా మల్టీ స్టారర్ ఇమేజ్ తోడు కానుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఈ సినిమాలో మహాశివుడి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ‘ఆది పురుష్’లో శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్, ‘కన్నప్ప’లో మహా శివుడిగా కనిపించనున్నాడన్న మాట. ఈ సినిమాపై బజ్ పెరడగడంలో ఈ అంశమే ఇప్పుడు ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ స్థాయి  సంచలనాన్ని సృష్టిస్తుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్