ఎన్నికల ముందు చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు అన్నారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేస్తున్నారని, డీబీటీ; నాన్-డీబీటీ ద్వారా దాదాపు 4.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేశారని, ప్రభుత్వ స్కూళ్ళలో నాడు–నేడు ద్వారా రూ.65 వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించి, పిల్లలకు ఇంగ్లీషు మీడియం సహా గొప్ప చదువులు అందిస్తున్నారని ప్రశంసించారు. భారీ జనసందోహం నడుమ సాగిన సామాజిక సాధికార బస్సుయాత్రతో తణుకు దద్దరిల్లింది. ప్రజలు పెద్దసంఖ్యలో హాజరైన ఈ బహిరంగసభలో నేతలు ఉత్సాహంతో ప్రసంగించారు. డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, నందిగం సురేష్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, సినీ నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ నాడు-నేడుకు ఖర్చు చేసిన రూ.65 వేల కోట్లు వేరే పనికి ఖర్చు పెడితే ఓట్లు వస్తాయని కొందరు అంటే, నాకు ఓట్లు ముఖ్యం కాదని జగన్ స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలోని పేదవారి ఆరోగ్యం గురించి ఆలోచన చేసి ఆరోగ్య సురక్ష తీసుకొచ్చారని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారని వివరించారు. మన పొరుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశమంతా ఏపీవైపు చూసేలా పాలన సాగుతోందని… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్నదేనని స్పష్టం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న తణుకు నియోజకవర్గంలో రూ.2,800 కోట్లకుపైగా సంక్షేమం, అభివృద్ధి చేయగలిగామని అన్నారు.
పత్తికొండలో…
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సామాజిక సాధికారయాత్ర విజయవంతమైంది. వేలాదిగా జనం తరలివచ్చారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. డిప్యూటీసీఎం అంజాద్ బాషా, మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఆదిమూలపు సురేష్, ఎంపీ సంజీవ్‌కుమార్, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు
* భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జగనన్న సామాజిక సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.
* బీసీల కులగణనకు అంగీకరించిన జగనన్న.. బీసీలందరికీ న్యాయం చేయాలని భావిస్తున్నారు.
* వెనుకబడిన వర్గాలవారు నేడు ఆత్మగౌరవంతో.. తలెత్తుకు తిరుగుతున్నారంటే అది జగనన్న చలవే.
* బాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చులకనగా చూశారు. అవహేళన, అవమానాల పాలుజేశారు.
* నేడు జగనన్న పాలన మంచికి, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
* మహిళా సాధికారత విషయంలోనూ జగనన్న చేస్తున్న మంచి అంతా ఇంతా కాదు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…
* జగనన్న పాలనలో అవినీతి రహిత సమాజాన్ని చూస్తున్నాం.
* ఎలాంటి వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందడం ఇప్పుడే చూస్తున్నాం.
* నాలుగున్నరేళ్ల పాలనలో మన తలరాతలు, బతుకులు, మన కుటుంబాలు, మన పిల్లల తలరాతలు మారాయన్నది నిజం.
* చట్టసభల్లో ఎప్పుడూ అడుగుపెట్టని కొన్ని కులాలను పార్లమెంటు వరకూ తీసుకెళ్లిన ఘనత జగనన్నది.
* అంబేడ్కర్, పూలే ఆదర్శాలతో మన చేతులు పట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న మనసున్న నాయకుడు జగన్
* మన బతుకులు బాగుపడతాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
* ఈ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
* జగనన్న లాంటి నాయకుడు మరొకరు లేరు. మళ్లీ రారు.
* జగనన్నను నమ్మాం. నమ్మినందుకు ఆయన మనకు ఎంతో మేలు చేసి చూపారు.
* గతంలో చంద్రబాబును నమ్మినందుకు…ప్రజలకు ఎంత మోసం చేశారో అందరికీ తెలుసు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన రాజకీయ నాయకుడు, మోసకారి చంద్రబాబు.
విశాఖ తూర్పులో
సామాజిక సాధికార బస్సు యాత్ర విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. ఎంవీపీ కాలనీలోని ఏ ఎస్ రాజా కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగసభకు జనం తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, వాసుపల్లి గణేశ్ కుమార్, కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.
ఈ రందర్భంగామంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు చేసిన పాలనకు, జగన్ మోహన్ రెడ్డి చేసిన నాలుగున్నరేళ్ల పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రలో 14 లక్షలు పెన్షన్ లను వైఎస్ ఆర్ 60 లక్లలకు పెంచారని, అలాగే జగన్ సీఎం అయ్యాక అంచలంచెలుగా పింఛన్ మొత్తాన్ని రూ. 2750కి పెంచారని, త్వరలోనే రూ. 3000 చేయబోతున్నారని అన్నారు. సంక్షేమం అమలు విషయంలో జగన్ పొరుగు రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచారని వివరించారు. రూ. 25 వేల కోట్ల డ్వాక్రా రుణ మాఫీ, రూ. 56 కోట్ల రైతు రుణ మాఫిని జగన్ చేయగా, చంద్రాబు గత పాలనలో నమ్మించి మోసగించారని విమర్శించారు. పరిపాలనలో సంక్షేమానికి జగన్ సరికొత్త దిశ, దశను నిర్దేశం చేసారని విశ్వరూప్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్ధానాలను అమలు చేయక మోసం చేసిన నేత చంద్రబాబు అయితే, హామీలన్నింటిని తూచా తప్పకుండా అమలు చేసిన నిజాయితీ గల నేత జగన్ అని వివరించారు. మైనార్టీలకు, గిరిజనులకు మంత్రి పదవి నాలుగున్నరేళ్లపాటు ఇవ్వకుండా సామాజిక అన్యాయం చంద్రబాబు ఇస్తే, జగన్ అన్ని వర్గాలకు కేబినెట్ లో స్థానం కల్పించడంతో పాటుగా డిప్యూటీ సీఎం పదవులిచ్చిన సామాజిక న్యాయం చేసారని వివరించారు. మరోసారి జగన్ సీఎం కాకపోతే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉన్నందున మరోసారి మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వరూప్ అన్నారు.