ఇప్పుడు చాలామంది హీరోలు ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లు చేస్తూ వెళుతున్నారు. భారీతనం పరంగా చూసుకుంటే వెబ్ సిరీస్ లు సినిమాలతో పోటీ పడుతున్నాయి. వివిధ భాషల ప్రేక్షకులకు చాలా వేగంగా చేరువ కావడానికి వెబ్ సిరీస్ లు దోహదపడుతున్నాయి. అందువలన స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అలా కోలీవుడ్ హీరో ‘ఆర్య’ చేసిన వెబ్ సిరీస్ గా ‘ది విలేజ్’ .. అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రైలర్ తోనే ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడు మొదలవుతుందా అన్నట్టుగా చాలామంది దీని కోసం వెయిట్ చేశారు. ఇది హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందడమే అందుకు కారణం. ఈ సినిమాను చాలావరకూ చీకట్లోనే చిత్రీకరించారు. కథ అంతా కూడా ఒక గ్రామంలోనే నడుస్తుంది. అందువలన చాలామంది ఈ సిరీస్ పట్ల కుతూహలాన్ని కనబరిచారు. తమిళంతో పాటు మిగతా భాషల్లోను ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అది ‘కట్టియల్’ అనే గ్రామం … ఆ ఊరులో క్షుద్ర శక్తులు ఉన్నాయనీ, అటువైపు వెళ్లినవారెవరూ తిరిగిరారని చుట్టుపక్కల గ్రామాల వారు చెబుతుంటారు. అందువలన అటువైపు ఎవరూ వెళ్లరు .. అక్కడ ఎవరికైనా ఏమైనా అయిందని తెలిసినా ఎవరూ సాయానికి రారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో, షార్టు కట్ లో వెళదామనే ఉద్దేశంతో హీరో తన కారును ‘కట్టియల్’ గ్రామం వైపు తీసుకెళతాడు. అతనితో పాటు భార్య .. కూతురు ఉంటారు. ఆ ఊరు ఎంట్రన్స్ లోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది.