Sunday, October 6, 2024
Homeసినిమాహాట్ స్టార్ లో అడుగుపెడుతున్న 'వధువు'

హాట్ స్టార్ లో అడుగుపెడుతున్న ‘వధువు’

అవికా గోర్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇతర భాషల్లోనూ ఆమెకి మంచి గుర్తింపు ఉంది. అందుకు కారణం హిందీలో ఆమె చేసిన ‘బాలికా వధూ’. చైల్డ్ ఆర్టిస్టుగా ఆమెకి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టిన సీరియల్ ఇది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’గా వచ్చిన ఈ ధారావాహిక, ఇక్కడ కూడా విశేషమైన ఆదరణ పొందింది. ఈ కారణంగానే ఆమె ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, వరుస ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లాయి.

అయితే వ్యక్తిగత కారణాల వలన కొంత గ్యాప్ తీసుకున్న అవికా, ఇప్పుడు ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది. ఇటీవలే ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘మాన్షన్ 24’ సిరీస్ లో ఒక కీలకమైన పాత్రను ఆమె పోషించింది. ఇప్పుడు మరో సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది .. ఆ సిరీస్ పేరే ‘వధువు’. ఓ బెంగాలీ వెబ్ సిరీస్ కి ఇది రీమేక్. తెలుగులో ఈ సిరీస్ కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు.

ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సిరీస్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అవికా పెళ్లి కూతురు లుక్ తో ఉన్న పోస్టర్స్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూ వెళుతోంది. ఇది కూడా పెళ్లి కాన్సెప్ట్ తో నడిచే కథ కావడంతో, ‘వధువు’ అనే టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది కావడంతో, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సిరీస్ దూసుకుపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్