Saturday, November 23, 2024
HomeTrending Newsబాబు పాలనలో వ్యవసాయరంగం నిర్వీర్యం: ధర్మాన

బాబు పాలనలో వ్యవసాయరంగం నిర్వీర్యం: ధర్మాన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఏ స్థాయికి వెళ్లిందో అర్థంచేసుకోవాలని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. బాబు హయాంలో వ్యవసాయంరంగం మైనస్ గ్రోత్ లో పడిపోగా, ఇప్పుడు 5.56 శాతంతో పురోగమించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, గిట్టుబాటుధర కల్పన, విత్తనాలు అందుబాటులో ఉంచడం, రైతు భరోసా జమ వంటి చర్యలతో ఈ రంగాన్ని జగన్ పురోగతిలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. తన పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన బాబు ఇటీవల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారని ధర్మాన మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర, చోడవరం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర అశేష జనవాహిని మధ్య అపూర్వంగా సాగింది. వడ్డాది జంక్షన్ లో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎంపీలు నందిగాం సురేశ్, భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు ఉమాశంకర్ గణేశ్, అదీప్ రాజుతో పాటుగా ఎమ్మెల్సీ వరుద కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

ధర్మాన మాట్లాడుతూ…  ఒక్క రూపాయి కూడా అవినీతి లేని పాలనా వ్యవస్థను తీసుకువచ్చినది జగన్ కాకుంటే మరోవరికీ సాధ్యం కాలేదన్నారు. జగన్ పాలనలో పేదలంతా ఆత్మగౌరవంతో సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నారని గుర్తుచేశారు. ఎన్నికలు వస్తే చాలు పసుపు కుంకుమ లాంటివి బాబుకు గుర్తుకొస్తుంటాయని, కానీ జగన్ మాత్రం పాలనా బాధ్యతలు చేపట్టిన నుంచే మహిళా సాధికారతకు చర్యలు చేపట్టారన్నారు.

రాజంపేటలో

రాష్ట్రంలో సమర్ధ పాలనతో భారతదేశంలోని ప్రతిఒక్కరూ ఆంధ్రప్రదేశ్‌ వైపు  చూస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ ఇన్నాళ్లు రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలన్నింటినీ సిఎం జగన్ అక్కున చేర్చుకున్నారని కొనియాడారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట సామాజిక సాధికార యాత్రలో వేలాదిగా జనం పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ రమేష్‌బాబు, జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డితో పాటు అనేకమంది స్థానిక సంస్థల నాయకులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

హఫీజ్ ఖాన్ మాట్లాడిన ముఖ్యాంశాలు: 
⦿ విద్యావ్యవస్థను పూర్తిగా మార్చేసి నిరుపేదల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందిస్తున్నారు ⦿ ఇంగ్లీషు చదువులతో పేదల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్నారు జగన్
⦿ 3 వేల పైచిలుకు జబ్బుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చారు జగనన్న.
⦿ అందువల్లే ఈ రోజు ఎంత పేదవారైన కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం  చేయించుకుంటున్నారు
⦿ దేశం మొత్తం జగనన్న పథకాలను అనుసరించాలని చూస్తోంది.
⦿ చంద్రబాబు హయాంలో ఓ వర్గం మినహా బాగుపడ్డవారంటూ ఎవరూ లేరు.
⦿ ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలను చంద్రబాబు అవమానించి, చులకనగా చూశారు.
⦿ గతంలో ఆయన ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మోసకారి బాబు మనకొద్దు.
⦿ జగనన్ననే మళ్లీ గెలిపించుకుందాం. జగనన్న మన అవసరం.

ఎమ్మెల్యే మేడా మాట్లాడిన ముఖ్యాంశాలు:
⦿ తన సుదీర్ఘ పాదయాత్రలో జగన్‌ ప్రజల కష్టాలు చూశారు. కన్నీళ్లు తుడిచారు.
⦿ తమకోసం నడిచొచ్చిన నేతను జగన్‌ లో చూసుకుని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు.
⦿ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టారు
⦿ రాజంపేట నియోజకవర్గంలో 94వేల ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల కుటుంబాలున్నాయి.
⦿ ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి కుటుంబానికి ఇంటి దగ్గరకే సంక్షేమం అందేలా చేశారు జగనన్న
⦿ మన ఒక్క నియోజకవర్గానికే సంక్షేమ,అభివృద్ధి పథకాలకు వేల కోట్లు అందించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్