మంచిమనసున్న జగనన్న వల్ల ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతోందని, సామాజిక విప్లవం ద్వారా సాధికారత చేసి చూపారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా పేదలను పై స్థాయికి తీసుకువచ్చారని, వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు పలమనేరు బ్రహ్మరథం పట్టింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. స్థానిక శాసనసభ్యుడు వెంకటే గౌడ అధ్యక్షతన సాగిన బహిరంగసభలో డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామి, మంత్రి గుమ్మనూరు జయరామ్, ఎంపీ రెడ్డప్ప, మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా, జనం కదలకుండా నేతల ఉపన్యాసాలు విన్నారు.
నారాయణ స్వామి మాట్లాడిన ముఖ్యాంశాలు:
* వరుణ దేవుడు మన వెంట ఉండి ఆశీర్వదిస్తున్నట్టు ఉందీ రోజు.
* నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ, పేదల ఆర్థిక స్థాయిని పెంచిన ముఖ్యమంత్రి జగనన్న.
* ఈరోజు ఏ పేదవాడికి ఆకలి బాధలు లేవు. పిల్లల చదువులు ఎట్లరా దేవుడా? అని తల పట్టుకునే పరిస్థితి లేదు.
* ఇళ్ల గడవడం ఎలా అని ఆలోచించే పనిలేదు. పెద్దపెద్ద జబ్బులొచ్చినా భయపడాల్సిన పనిలేదు.
* జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం. జగనన్న పాలనలోనే పేదల బతుకుల్లో వెలుగులు.
* చంద్రబాబును నమ్మితే మనం పూర్తిగా మునిగినట్టే.
* బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను చులకనగా చూసి, అవమానాల పాలు చేసినవాడు చంద్రబాబు.
* నా బీసీ,నా ఎస్సీ,నాఎస్టీ, నామైనార్టీలంటూ మనల్ని అక్కున చేర్చుకుని, మనస్థాయిని పెంచిన, పెంచుతున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన ధర్మం.
* సింహంలాంటి జగనన్న అడుగుల్లో అడుగులేసి ముందుకు సాగుదాం.ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడిన అంశాలు:
* సామాజిక న్యాయం అన్నది గతంలో కనిపించని విషయం.
* సామాజిక న్యాయమంటే ఏమిటో చెప్పి చూపించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
* తనకే ష్యూరిటీ…గ్యారెంటీ లేని చంద్రబాబు మనకు ష్యూరిటీ ఇస్తాడట..గ్యారంటీ ఇస్తాడట. నమ్మదగ్గ విషయమేనా ఇది?
* పద్నాలుగు సంవత్సరాల తన పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు…ఇప్పుడు ఏదో చేస్తానంటున్నాడు.
* నిన్ను నమ్మం బాబు..అని ఆయనకు గట్టిగా చెప్పాల్సిందే. మన నమ్మకం జగనన్న. ఆయన వెంట నడవడమంటే…మన భవిష్యత్తుకు గ్యారంటీ కోసమన్నది మరవద్దు.