Thursday, June 18, 2026
Homeసినిమా'ఆహా'లోను అదే జోరు చూపుతున్న 'మా ఊరి పొలిమేర 2'

‘ఆహా’లోను అదే జోరు చూపుతున్న ‘మా ఊరి పొలిమేర 2’

‘సత్యం’ రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల .. బాలాదిత్య ప్రధానమైన పాత్రలను పోషించిన ‘మా ఊరి పొలిమేర’ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2’ థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ల నుంచి మాత్రమే కాదు, ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి విశేషమైన స్పందన లభిస్తూ ఉండటం విశేషం.

ఈ సినిమా ‘ఆహా’లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకోవడం ఒక రికార్డుగా ‘ఆహా’ టీమ్ తెలిపింది. ఆ తరువాత కూడా ఈ సినిమా జోరు అదే రేంజ్ లో కొనసాగుతోంది.ఈ సినిమా మరిన్ని అరుదైన రికార్డులను అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ చిన్న సినిమా .. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. సత్యం రాజేశ్ – కామాక్షి భాస్కర్ల నటన నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది.

క్షుద్రవిద్యలను ఆశ్రయించిన కుటుంబంలో పుట్టిపెరిగిన హీరో, అదే మార్గంలో ముందుకు వెళతాడు. అతని భార్యకి మాత్రం అది ఇష్టం ఉండదు. ఆమె మాటను అతను ఎంతమాత్రం వినిపించుకోడు. ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఆలయంలోని ‘నిధి’ని సొంతం చేసుకోవడానికి, మరిన్ని క్షుద్రశక్తులను ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేదే కథ. బ్లాక్ మేజిక్ చుట్టూ తిరిగే ఈ కథ, బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావడం అరుదైన విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular