సమాజ హితాన్ని కాంక్షించే నాటకరంగాన్ని సజీవంగా ఉంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో కృపి చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబందాల శాఖ, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.
నేడు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మొదలైన నందినాటకోత్సవాలు-2022 ప్రారంభోత్సవ సభకు మంత్రి చెల్లుబోయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర చలన చిత్ర టీవి మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, ఎఫ్.డి.సి. ఎండి టి. విజయ్ కుమార్ రెడ్డి, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి నగరపాలక సంస్థ మేయు కావటి శివనాగమ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాలు వినోదంతో పాటు సమాజంలో సంస్కరణలకు దోహదం చేస్తాయని అన్నారు. నంది నాటకోత్సవాలను కళలకు ప్రాముఖ్యత ఉన్న గుంటూరులో నిర్వహించడంతో పాటు కళా ప్రాంగణానికి స్వాతంత్ర సమరయోధుడు, సత్యహరిశ్చంద్ర నాటకకర్త బలిజేపల్లి లక్ష్మీకాంతం పేరు పెట్టడాన్ని మంత్రి అభినందించారు.
కళాకారులు ఆర్జితం కంటే ఆశయం, సమాజ హితం కోసం ప్రదర్శనలు చేస్తుంటారని, అందుకే కళలను చిత్తశుద్ధితో ప్రోత్సహించి, కళాకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం జగన్ సంకల్పించారని మంత్రి తెలిపారు సత్యహరిశ్చంద్ర నాటకంతో మహాత్మా గాంధీ ఎంతో ప్రేరణ పొందారని, అదే కోవలో అసత్యం ద్వారా వచ్చే అధికారం తనకొద్దు అంటూ వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. పేదరికం అనే రోగంతో తరతరాలుగా పీడింపబడుతున్న వారికి ఔషధం కనిపెట్టిన పాలకుడు జగన్ అని కొనియాడారు.
సినీ రంగంతో పాటు సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా… ప్రాచీన కాలం నుంచి వస్తున్న నాటక రంగానికి ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాంటి కళాకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి చెల్లుబోయిన హామీ ఇచ్చారు
నంది నాటక ప్రదర్శనల్లో భాగంగా ఈరోజు సన్నివేశాలు మొదటగా రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం వారి ‘శ్రీ కాళహస్తీశ్వర మహత్యం’ పద్య నాటకం ప్రదర్శించారు.
సాంఘిక నాటకం విభాగంలో శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారి ‘ఎర్ర కలువ’…
సాంఘిక నాటిక విభాగంలో శ్రీ అమృత లహరి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘నాన్నా. నేనొచ్చేస్తా’ నాటకాలను ప్రదర్శించారు.