Thursday, March 12, 2026
Homeసినిమా'సలార్' సౌండ్ మామూలుగా లేదే!  

‘సలార్’ సౌండ్ మామూలుగా లేదే!  

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ సినిమాను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. ప్రభాస్ ను మాస్ లుక్ తో చూపించడంలోనే ప్రశాంత్ నీల్ సగం మార్కులు కొట్టేశాడు. అలాగే ఈ సినిమా కోసం ఆయన మలయాళం నుంచి  పృథ్వీ రాజ్ సుకుమారన్ ను రంగంలోకి దింపాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ కి మలయాళంలో ఉన్న క్రేజ్ గురించి .. మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

అలాంటి  పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడంటే విషయం కాస్త గట్టిగానే ఉంటుందని అంతా భావించారు. అలాగే హీరో పాత్రతో పాటు సమానంగా దర్శకుడు ఈ పాత్రను కూడా నడిపించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, 3 రోజులలో 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా అదే స్థాయిలో దూసుకుపోతోంది. దాంతో ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలను చూసుకుంటే ‘రాధేశ్యామ్’, ‘ఆది పురుష్’ కనిపిస్తాయి. ‘రాధేశ్యామ్’ క్లాసికల్ టచ్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ. ‘ఆది పురుష్’ అనేది రామాయణం నేపథ్యంలో నడిచే కథ. అందువలన ప్రభాస్ ను మాస్ హీరోగా చూడటానికి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన ‘సలార్’ వాళ్ల ఆకలి తీర్చిందనే చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular