Friday, November 22, 2024
HomeTrending Newsనవరత్నాలతో పేదలకు లబ్ధి: రాజన్నదొర

నవరత్నాలతో పేదలకు లబ్ధి: రాజన్నదొర

నాలుగున్నరేళ్లుగా సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చే, పేదలను కష్టాలనుంచి గట్టెక్కించే పాలన చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లంచాలు, రికమెండేషన్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల లబ్ధి వచ్చేలా చేశారని కొనియాడారు. నెల్లూరు జిల్లా కోవూరులో సామాజిక సాధికారత వెల్లివిరిసింది.  బస్సు యాత్రకు జనం జేజేలు పలికారు. స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సభలో రాజన్నదొర మాట్లాడిన ముఖ్యాంశాలు:
* ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.5 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు.
* గతంలో ఎవరూ చేయని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న.
* గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు.
* జగనన్న ఇద్దరికి మంత్రిపదవులే కాదు, డిప్యూటీ సిఎం పదవి కూడా ఇచ్చారు.
* 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 17 వేల మందికి 40 వేల ఎకరాలే.
* మన జగనన్న మనమీద ప్రేమతో 3 లక్షల ఎకరాలకుపైగా, 2 లక్షల మంది గిరిజనులకు భూములిచ్చారు.
* పోడు భూములకు రైతు భరోసా ఇచ్చిన నాయకుడు మన జగనన్న. 3.45 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు.
* అమ్మ ఒడి, చేయూత, చేదోడు, జగనన్న తోడు, పింఛన్.. ఇన్ని పథకాలు ఎప్పుడైనా చూశామా?
* నవరత్నాలు లేకపోతే గిరిజన కుటుంబాలు ఆకలితో ఉండాలి. ఇప్పుడు ఒక్క కుటుంబం కూడా ఆకలితో లేరు.

ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన అంశాలు:
* నియోజకవర్గంలో 1.28 లక్షల కుటుంబాల అభివృద్ధికి మన జగనన్న నేరుగా ఖాతాల్లో రూ.981 కోట్లు వేశారు.
* నాన్ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారు.
* ఇందులో బీసీలకు నేరుగా రూ.564 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.214 కోట్లు ఇచ్చారు.
* ఎస్సీలకు నేరుగా రూ.256 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.103 కోట్లు ఇచ్చారు.
* ఎస్టీలకు నేరుగా రూ.139 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.68 కోట్లు
* మైనార్టీలకు నేరుగా రూ.22 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.9 కోట్లు ఇచ్చారు.
* ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో కనబడని వ్యక్తులు రకరకాల చొక్కాలు వేసుకొని దసరా వేషాలతో వస్తున్నారు.


* జగనన్న రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని అందరం కోరుకోవాలి.
* ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ప్రభుత్వాలు గతంలో లేవు.
* మిమ్మల్ని ఆదుకున్న జగనన్నను మీ బిడ్డగా ఆశీర్వదించండి.
* మరోసారి జగన్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని, కొడవలూరు మండలం నార్తురాజుపాలెం గ్రామంలో 2024 జనవరి 20న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహా రుద్రాభిషేకం చేయిస్తున్నాం.
* లక్షా 108 కొబ్బరికాయలు కొడతాం. మీరంతా భాగస్వాములై ఒక్కో కొబ్బరికాయ కొట్టాలి. లక్ష రుద్రాక్షలతో అభిషేకం, లక్ష బిళ్వార్చనతో అభిషేకం, లక్ష కుంకుమార్చన చేస్తాం. అందరి ఆశీర్వాదం జగనన్నకు ఉండాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్