Sunday, March 8, 2026
Homeసినిమామెగాస్టార్ తో తలపడనున్న బాలీవుడ్ విలన్ ఇతనే!

మెగాస్టార్ తో తలపడనున్న బాలీవుడ్ విలన్ ఇతనే!

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన దగ్గర నుంచి ఇక్కడ బాలీవుడ్ స్టార్స్ సందడి పెరిగి పోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందినవారు .. స్టార్ విలన్ గా క్రేజ్ ఉన్నవారు సైతం తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. సంజయ్ దత్ .. సైఫ్ అలీఖాన్ మొదలు, ఇక్కడ విలన్ రోల్స్ చేయడానికి సై అంటున్నారు. అలా ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు కునాల్ కపూర్.

మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో చూడగానే కునాల్ ఆకట్టుకుంటాడు. ‘రంగ్ దే బసంతి’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించిన కునాల్ ను చిరంజీవి – శ్రీవశిష్ట సినిమా కోసం ఎంపిక చేశారు. అతని పాత్రకి సంబంధించిన చిత్రీకరణ రీసెంటుగా మొదలైంది. చిరంజీవి కాంబినేషన్లో లేని సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. త్వరలోనే మెగాస్టార్ ఈ సెట్ లో అడుగుపెట్టనున్నారు. అప్పుడు ఇద్దరి కాంబినేషన్ లోని సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

నిజానికి ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ‘రానా’ను తీసుకోవాలనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన  కునాల్ ను తీసుకోవలసి వచ్చిందని అంటున్నారు. ఈ కథలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్న ఈ సినిమాకి, ‘విశ్వంభర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ నే ఖరారు చేస్తారేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular