నియోజకవర్గాలకు కొత్త ఇన్ ఛార్జ్ లను నియమిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు 27 మందితో రెండో జాబితాను ఖరారు చేశారు. వీటిలో 3 ఎంపి స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ జాబితాను సజ్జల రామక్రిష్ణారేడ్డితో కలిసి మీడియాకు వెల్లడించారు. ఐదుగురు వారసులకు చోటు లభించింది. వీరిలో నలుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు కాగా, మరొకరు ఎంపి. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి, తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి కుమార్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్య ప్రకాష్, గుంటూరు వెస్ట్ నుంచి షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమా లకు అవకాశం కల్పించారు. నలుగురు ఎంపిలను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ఖరారు చేశారు. పిఠాపురం నుంచి వంగా గీత (కాకినాడ ఎంపి); రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భారత్( రాజమండ్రి ఎంపి); అరకు ఎస్టీ నుంచి గొడ్డేటి మాధవి (అరకు ఎంపి); కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య (అనంతపురం ఎంపి)లు ఉన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ను రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దించుతున్నారు.
మాజీ మంత్రి శంకర నారాయణను అనంతపురం ఎంపిగా, పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని అరకు ఎంపిగా పోటీ చేయిస్తున్నారు. నేడు పార్టీలో చేరిన బళ్ళారికి చెందిన జె. శాంతను హిందూపురం ఎంపి టికెట్ కేటాయించారు. రాష్ట్ర ఐటి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో కొత్త అభ్యర్ధికి అవకాశం ఇచ్చారు. కంబాల జోగులు, వెల్లంపల్లి శ్రీనివాస్ లకు స్థానచలనం కలిగింది.
-
-
- రాజాం ఎస్సీ – డా. తాళ్ళ రాజేష్
- అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
- పాయకరావు పేట ఎస్సీ – కంబాల జోగులు
- రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాష్
- పి. గన్నవరం (ఎస్సీ)- తిప్పర్తి వేణుగోపాల్
- పిఠాపురం – వంగా గీత
- జగ్గంపేట – తోట నరసింహం
- ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
- రాజమండ్రి సిటీ – మార్గాని భారత్
- రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
- పోలవరం ఎస్టీ – తెల్లం రాజ్యలక్ష్మి
- కదిరి – బిఎస్ మక్బూల్ అహ్మద్
- ఎర్రగొండపాలెం ఎస్సీ – తాటిపర్తి చంద్రశేఖర్
- ఎమ్మినగూర్ – మాచాని వెంకటేష్
- తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
- గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
- మచిలీపట్నం – పేర్ని క్రిష్ణమూర్హి
- చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
- పెనుగొండ – కెవి ఉషశ్రీ చరణ్
- కల్యాణదుర్గం – తలారి రంగయ్య
- అరకు ఎస్టీ – గొడ్డేటి మాధవి
- పాడేరు ఎస్టీ – మత్స్య రాజ విశ్వేశ్వర రాజు
- విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస్
- విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్
-