వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల మూడో విడత జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ ను పెడన నుంచి పెనమలూరుకు స్థానచలనం కలిగింది. మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ ను ఏలూరు నుంచి లోక్ సభకు పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ విశాఖ నుంచి లోక్ సభకు పోటీచేయనున్నారు. తిరుపతి ఎంపి గురుమూర్తిని సత్యవేడుకు పంపి అక్కడి ఎమ్మెల్యే ఆదిమూలంకు తిరుపతి సీటు కేటాయించారు.
ఎంపి సీట్లు:
- శ్రీకాకుళం – పేరాడ తిలక్
- విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మి
- ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
- విజయవాడ – కేశినేని నాని
- కర్నూలు – గుమ్మనూరు జయరాం
- తిరుపతి – కోనేటి ఆదిమూలం
ఎమ్మెల్యే సీట్లు:
- ఇచ్ఛాపురం – పిరియ విజయ
- టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
- చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు
- రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
- దర్శి – బూచేపల్లి శివప్రసాద రెడ్డి
- పూతలపట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
- చిత్తూరు – విజయానంద రెడ్డి
- మదనపల్లి – నిస్సార్ అహ్మద్
- రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
- ఆలూరు – బూసినే విరూపాక్ష
- కోడుమూరు (ఎస్సీ) – డా. సతీష్
- సత్యవేడు (ఎస్సీ) – డా. మద్దిల గురుమూర్తి
- గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళి
- పెనమలూరు – జోగి రమేష్
- పెడన – ఉప్పల రాము