Wednesday, April 2, 2025
HomeTrending News24X7 మంచినీటి సరఫరా: బొత్స

24X7 మంచినీటి సరఫరా: బొత్స

విజ‌య‌వాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు  చేపట్టందని బొత్స వెల్లడించారు.  అందులో భాగంగా ఈ రోజు ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు  100.07 కోట్లు రూపాయ‌ల‌తో అమృత్ పథకానికి శ్రీ‌కారం చుట్టమని   రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అమృత్ పథకంలో భాగంగా విజ‌య‌వాడ‌ నగర పాలక సంస్థ పరిధిలో 24X7 మంచినీటి సరఫరా ప‌థ‌కాన్నిశ‌నివారం ఐనాక్స్ థియేటర్ వెనుక  సాంబమూర్తి రోడ్ లో  దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. న‌గ‌ర మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు,  జిల్లా క‌లెక్ట‌ర్ నివాస్ ఐ.ఏ.ఎస్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, ఆవుతు శ్రీ శైల‌జా రెడ్డి, న‌గ‌ర పాల‌క సంస్థ‌ కార్పొరేట‌ర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ నిధులతో పాటు న‌గ‌ర పాల‌క సంస్థ నిధుల‌తో  ఏడాది లోపు నిర్మాణం పూర్తి  చేసి అందుబాటులోకి తీసుకువ‌స్తాం అన్నారు. దీని ద్వారా  న‌గ‌రంలో 29 వార్డుల‌కు 24X7 మంచినీటి సరఫరాను అందిస్తుంద‌న్నారు. విజయవాడకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప‌నిచేస్తోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్