హైదరాబాద్, గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున 1500 కంటే ఎక్కువ మంది కళాకారులు వేడుకల్లో ప్రదర్శన ఇస్తున్నారు. భారతనాట్యం, కూచిపూడి, కథక్, పేరిణి, శింగరి మేళా, రాజస్థానీ, బాంగ్ర, మొదలైన కళా ప్రదర్శనలతో భారతీయ, తెలంగాణ కళారూపాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.
చిందుయక్ష గానం, ఒగ్గు డోలు, బైండ్ల,కోలాటం,బోనాల కోలాటం, దప్పులు, పులి వేషాలు బోనాలు, కర్ర సాము, గిరిజన కళారూపాలు ఉంటాయి. కొమ్ము, కోయ, గుస్సాడి, బంజారా, చెంచు మరియు హైదరాబాదీ దక్కని కళ వంటి చాలా స్థానిక జానపద కళా రూపాలను SHERI BAAJA, MARPHA, QAWWALI వంటి రూపాలు మరియు రాజ వైభవం యొక్క కాంతి ప్రకాశం వారి గొప్ప సాంప్రదాయ దుస్తులు, వస్త్రధారణ, సంగీతం మరియు నృత్యంతో వేడుకలకు రంగులు జోడిస్తుంది.
గోల్కొండ కోట యొక్క 621 సంవత్సరాల పురాతన చారిత్రక ప్రదేశంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఖచ్చితంగా సాంస్కృతిక వేడుకగా మారుతుంది.