Saturday, November 23, 2024
HomeTrending Newsమహిళలకు శ్రీవారి ఆశీస్సులందిన మంగళసూత్రాలు

మహిళలకు శ్రీవారి ఆశీస్సులందిన మంగళసూత్రాలు

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిళలకు అరుదైన ఆశీస్సులు అందజేయనున్నారు. హిందూ మతానికి చెందిన మహిళలు పవిత్రంగా భావించే తాళిబొట్లను (మంగళ సూత్రం) శ్రీవారి ఆలయం నుంచి అందించబోతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళ సూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈ రకంగా తయారు చేసిన తాళి బొట్లను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. ఇ

ప్పటికే వివాహం అయిన వారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని భక్తుల విశ్వాసం. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఈ మంగళ సూత్రాలు తయారు చేయబోతోంది. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి.
భూమన గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32 వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. ఈ జంటలన్నీ స్వామివారి ఆశీస్సులతో మతాంతీకరణలకు దూరంగా జీవిస్తున్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి మహిళలకు స్వామివారి ఆశీస్సులు అందిన మంగళ సూత్రాలు అందించాలనే ఆలోచన చేసి కార్య రూపంలోకి తెచ్చారు.

టిటిడి నిర్ణయాలు:

  • రూ.5,141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించింది.
  • తిరుమలలో మహిళల కోసం 5, 10 గ్రాముల మంగళసూత్రాలు విక్రయించాలని బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
  • 73 మంది పోటు కార్మికుల వేతనాలు పెంచాలని..టీటీడీ స్విమ్స్ సూపర్ స్పెషాలిటీని 1200 పడకలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
  • ఆకాశ గంగ వరకు 4 లైన్ల రహదారి నిర్మించనున్నారు.
  • టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు, తిరుమల ఆస్థాన మండపం వేదికగా 57 మంది పీఠాధిపతులతో ధార్మిక సదస్సు నిర్వహించేందుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు.
  • వేదపాఠశాలల అధ్యాపకులకు జీతాల పెంపు, టీటీడీలో కొత్త ఉద్యోగాల ఆమోదానికి ప్రభుత్వానికి లేఖ రాయడం, రూ.6.9 కోట్లతో రాజగోపుర నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్