రాష్ట్ర విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యావిధానాన్ని ప్రవేశం పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం కుదిరింది. సిఎం జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ Anton beguin లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి ఐబీ డైరెక్టర్ జనరల్ olli pekka heinonen. వర్చువల్‌గా పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు.