Tuesday, March 10, 2026
Homeసినిమాచిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కు ఎంపికైన సుప్రసిద్ధ సినీ నటుడు కొణిదెల చిరంజీవిని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ లోని రాజ్ భవన్‌లో ఘనంగా సత్కరించారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ సన్మానాన్ని స్వీకరించి గవర్నర్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular