Friday, November 22, 2024
HomeTrending Newsజగన్ ఎద్దేవా.. బాబు 'సిద్ధం'గా లేరట..!

జగన్ ఎద్దేవా.. బాబు ‘సిద్ధం’గా లేరట..!

మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు అర్ధాంగి ‘మా ఆయన సిద్ధంగా లేడు’ అంటున్నారని… ఏకంగా కుప్పంలోకి వెళ్లి ఆమె బైబై బాబు అంటూ పంచ్ డైలాగులు చెప్పారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి బాబును రాష్ట్ర ప్రజలతో పాటు కుప్పంలో కూడా సమర్థించడంలేదని అన్నారు. తనకు కుప్పంలో పోటీ చేయాలని ఉందని, బాబుకు విశ్రాంతి ఇద్దామని అనుకుంటున్నామని  ఇటీవలి పర్యటనలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన సరదా వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో  లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీతోపాటు కన్వేయన్స్ డీడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ విపక్షాలపై పదునైన విమర్శలు చేశారు.

తాము ఒకవైపున పేద ప్రజల గురించి ఇన్ని అడుగులు వేగంగా వేస్తుంటే, గతంలో ఈ పని చేయని చంద్రబాబు  మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదని… పేదల ఇంటి నిర్మాణాలు అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ‘ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది.. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే.. పురాణాల్లో మనం కథలు కథలుగా విలన్లుగా చెప్పుకొనే రాక్షసులందరికంటే ఒక్క బాబు దుర్మార్గం వీళ్లందరికంటే ఎక్కువ అనిపిస్తుంది” అంటూ ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన కొన్ని ముఖ్యాంశాలు

  • ఏనాడూ ఏపీలో లేని వారు, ఏపీకి రాని వారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన వారే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు.
  • ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి.

  • నాకు చంద్రబాబు నాయుడుమాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి మద్దతు తోడు లేవు.
  • కానీ మీ అందరితో కోరేది ఒక్కటే. మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని కోరుతున్నా.
  • నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు.
  • మీ అందరితో ఒక్కటే చెబుతున్నా. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.
  • అబద్ధాలను నమ్మకండి, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారన్నది జ్ఞాపకం పెట్టుకోండి.
  • మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా, తోడుగా మీరే నిలబడండి అని మరోసారి కోరుతున్నా.
  • దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడి చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఉండాలని మనసారా కోరుకుంటున్నా
  • రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు నుంచి మరో 10 రోజులు జరుగుతూ పోతుంటుందని సంతోషంగా చెబుతున్నా.
RELATED ARTICLES

Most Popular

న్యూస్