Friday, September 20, 2024
HomeTrending Newsవెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సిఎం

వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సిఎం

ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు  రెండో టన్నెల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు  ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద జరిగే కార్యక్రమంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తి చేసి నేడు (06.03.2024) జంట టన్నెల్స్ ను ఒకే సారి ప్రారంభించనున్నారు.

 పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు – ప్రాజెక్ట్ విశిష్టతలు

ప్రాజెక్టు అంచనా వ్యయం – రూ. 10,010.54 కోట్లు
నీటి లభ్యత – శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువన 841 మీటర్ల నీటిమట్టం (సిల్ లెవెల్) నుండి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాల తరలింపు…
సాగు నీరు – 4,47,300 ఎకరాలు
త్రాగు నీరు – 15.25 లక్షల మంది
లబ్ది పొందే జిల్లాలు – ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలు..
మొదటి దశ (కెనాల్ డిస్ట్రిబ్యూటరీ): ప్రకాశం జిల్లా పరిధిలో 1,19,000 ఎకరాలకు సాగు నీరు,
4 లక్షల మందికి త్రాగు నీరు..
రెండవ దశ(కెనాల్ డిస్ట్రిబ్యూటరీ): ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 3,28,300
ఎకరాలకు సాగు నీరు, 11.25 లక్షల మందికి త్రాగు నీరు..
నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం – 53.85 టీఎంసీలు

ప్రకాశం జిల్లా పామూరు, పెదచెర్లోపల్లి మండలాల పరిధిలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అంద్ మాన్యుఫ్యాక్టరింగ్ జోన్ (NIMZ) కు వెలిగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.27 టీఎంసీల నీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  వెలిగొండ జంట టన్నెల్స్ పూర్తయిన నేపథ్యంలో ఆర్ అండ్ ఆర్ ను కూడా త్వరలో పూర్తి చేసి ఇక వచ్చే సీజన్ లో నల్లమల సాగర్ లో నీళ్లు నింపడం జరుగుతుందని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్