తమ ప్రభుత్వం చేసినట్లుగా అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ 58 నెలల కాలంలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఆ పదానికి అర్థం చెబుతూ తమ పాలన సాగిందన్నారు. 45-60 సంవత్సరాల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతియేటా ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజు ఈ కార్యక్రమం చేపట్టడం గర్వకారణంగా ఉందన్నారు.
సిఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- వైయస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి పంపించినట్లయింది.
- దీనితో పాటు నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు
- గతంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి.
- వైయస్సార్ చేయూత ద్వారా 45-60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనార్టీలంటూ తోడుగా ఉంటూ ఆర్థిక పటిష్టతకు ఏకంగా 19,190 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
- గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా?
- 45-60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.
- గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు.
- చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి.
- మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది.
- ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా.
- ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.
- రాబోయే రోజుల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి.
- మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు.
- దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది.
- చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు.
- ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా.
- మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు.
- చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు.
- చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు
- దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నా