Friday, November 22, 2024
HomeTrending Newsఎంతమంది ఏకమైనా విజయం మాదే: సజ్జల ధీమా

ఎంతమంది ఏకమైనా విజయం మాదే: సజ్జల ధీమా

దింపుడుకల్లం ఆశతోనే చంద్రబాబు పొత్తుల కోసం పాకులాదుతున్నారని, ఈ పొత్తుల పంచాయతీ రెండు నెలలుగా జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటిలేటర్‌పై ఉన్నవాడు దింపుడుకల్లం ఆశతో చేసే ప్రయత్నంగా దీన్ని అభివర్ణించారు. ప్రపంచంలోని అన్ని శక్తులను కూడగట్టుకుని జగన్‌ని ఓడించాలని చూస్తున్నారని, అందుకే ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సజ్జల మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఆఖరి క్షణంలో ఒక గడ్డిపూచ దొరికినా దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరాలనేలా చంద్రబాబు చేస్తున్నారు. ఇది తమ బలమని, ఏదో చేయగలమని అనుకుంటే వారి భ్రమే.
  • ఇది ఒక నిస్పృహ..ఇది మిస్‌ అయితే ఇక నేను అయిపోయినట్లే అని భావించి చేస్తున్న ప్రయత్నంలా అనిపిస్తోంది.
  • ప్రతి సారీ ఎవరో ఒకరి సాయం తీసుకుని గట్టెక్కాలని చూస్తూనే ఉన్నాడు. కొన్ని సార్లు అవతల పార్టీలను బట్టి సక్సెస్‌ అయ్యాడు.
  • అన్ని సందర్భాల్లో అది సక్సెస్‌ కాదు. 2009లో ఆయన అన్ని కూటమిలు ఏకమైనా ఆయన వల్ల కాలేదు.
  • ఈ సారి వెరైటీ ఏంటంటే..బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను కూడా తన కంట్రోల్‌లో పెట్టుకుని..అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు.
  • ఆయన చేస్తున్న ప్రయత్నాల్లోనే వైఎస్‌ జగన్‌ గారి బలం, ప్రజల్లో ఆయనకున్న అభిమానం స్పష్టమవుతోంది.
  • పడికట్టు మాటల్లాంటివి నాలుగు పట్టుకుని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివితే విలువేముంటుంది?
  • షర్మిల దివాళా తీసిన పార్టీని చంద్రబాబు చెప్పినట్లు రెంట్‌కు తీసుకుని నడుపుతున్నట్లుంది.
  • టార్గెట్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే విధంగా ముందుకు వెళ్తున్నారు.
  • ఇంకా రాను రాను నీచంగా కూడా పరిస్థితి మారొచ్చు. ఎందుకంటే నడిపించే వారు వారి కోరికలను ఇలా తీర్చుకుంటున్నారు.
  • ఇక్కడ అవకాశం లేక వెళ్లినవాళ్లందరినీ తీసుకుని అదే బలం అనుకుంటే వాళ్ల ఖర్మ.
  • చంద్రబాబు ఏది చేసిన ఒకటికి పది సార్లు చెప్పి ఒప్పించే నైపుణ్యం ఎల్లో మీడియా వద్ద ఉంది.
  • బలహీనతే బలం అని ప్రచారం చేసుకోగల ముఠా అది. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు.
  • పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడని భావించిన వాళ్లు నిరాశకు గురయ్యారు.
  • తనకున్న తిమ్మినిబమ్మిని చేయగలననే విశ్వాసంతో వీళ్లందరినీ కూడగట్టుకుని లబ్ధిపొందాలనేదే చంద్రబాబు వ్యూహం.
  •  మేమైతే ఒక పద్దతి ప్రకారం, నిబద్ధతతో అన్నిటికీ సర్వ సన్నద్ధంగా ఉన్నాం.
  • వాళ్లు ఇంకా ప్రిపరేషనే ప్రారంభం కాని స్టూడెంట్స్‌లానే ఉన్నారు.
    రానున్న రోజుల్లో అక్కడ అసంతృప్తులు, సీట్లు కొట్లాటలతో వార్తలు అక్కడే ఎక్కువ వస్తాయి.
  • పొత్తుల కోసం వారు పడుతున్న తాపత్రయం జగన్‌మోహన్‌రెడ్డి గారి బలాన్ని వ్యక్తం చేస్తోంది. వారి బలహీనతను వ్యక్తం చేస్తోంది.
  • వీళ్లు ఏది చేసినా 50 శాతాన్ని మించిన మద్దతు ప్రజల నుంచి మాకుంది కాబట్టి వీరందరూ ఏకమైనా విజయం మాదే.
  • వీళ్లంతా కలిసినా…వాళ్ల మధ్య భావసారూప్యం ఉందా అనేది కూడా చూడాలి.
  • 2+2=4 అనే లెక్కలు తప్ప…2+2=0 కూడా అవుతుందని గమనించడం లేదు.
  • అంతిమయాత్రలా, వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ టీడీపీ.
  • స్వరూపమే లేని పార్టీ జనసేన. బీజేపీకి రాష్ట్రంలో ఎన్ని ఓట్లు వచ్చాయో అందరూ చూశారు.
  • ఇవన్ని చూసిన తర్వాత వారి పొత్తు ఫలితం ఎలా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది.
  • అయితే వీళ్ల ఫెయిల్యూర్‌ పాలిటిక్స్‌ ప్రజలకు అర్ధం అయింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్