Friday, November 22, 2024
HomeTrending Newsబీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లీస్ చేతిలో కీలుబొమ్మలు - అమిత్ షా

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లీస్ చేతిలో కీలుబొమ్మలు – అమిత్ షా

కాంగ్రెస్, మజ్లీస్, బీఆర్ఎస్ మూడు కుటుంబ పార్టీలే అని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఈ మూడు పార్టీల జెండాలు వారైనా అజండా ఒక్కటే అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లీస్ చేతిలో కీలుబొమ్మలని… నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్‌ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొని బీజేపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపి సీట్లు గెలవటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని పిలుపుఇచ్చారు.

కాంగ్రెస్‌ అవినీతి, కుంభకోణాల పార్టీ అని అమిత్‌ షా ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేం చెప్పేది అవాస్తవమని చెప్పాలని సవాలు విసిరారు. సీఎం రేవంత్‌ రెడ్డి మజ్లిస్‌ పార్టీకి ఆప్తమిత్రుడు అని అమిత్‌ షా అన్నారు. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌ను చేశారని ఆరోపించారు.

సీఏఏను అమలు చేసి పాక్‌, బంగ్లాదేశ్‌ శరణార్థులకు న్యాయం చేశామని తెలిపారు. సీఏఏను కాంగ్రెస్‌,మజ్లిస్‌ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. సీఏఏఈ అమలుతో ముస్లింల పౌరసత్వం రద్దవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలే కుటుంబ సభ్యులుగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని, బీజేపీ 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు.

రాహుల్ గాంధి సేదతీరెందుకు విదేశాలకు వెళతారని ఎద్దేవా చేశారు. గడచిన 23 ఏళ్ళలో నరేంద్ర మోడీ సెలవు తీసుకోలేదన్నారు. మోడీ వద్ద 12 ఏళ్ళ ట్రాక్ రికార్డు ఉందని, 25 ఏళ్ళకు అజెండా కూడా ఉందని అమిత్ షా వెల్లడించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్