Monday, June 15, 2026
Homeసినిమాబన్నీతో మూడోసారి జోడీకడుతున్న పూజ హెగ్డే? 

బన్నీతో మూడోసారి జోడీకడుతున్న పూజ హెగ్డే? 

పూజ హెగ్డే .. నాజూకుదనానికి నమూనాగా కనిపించే పేరు. కాడమల్లే పూవులా కనిపించే రూపం. యూత్ లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒకానొక దశలో స్టార్  హీరోలందరి సినిమాల్లోను పూజ హెగ్డే కనిపించింది. ఆ సమయంలో ఆమె స్పీడ్ చూసి ఇతర హీరోయిన్స్ కాస్త కంగారు పడ్డారు. అంత వేగంగా భారీ సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఆ సినిమాలు విజయాలను సాధిస్తే లెక్క వేరేగా ఉండేది. ఫ్లాప్ కావడమే ప్రమాదానికి దారితీసింది.

పూజ ఆ మధ్య చేసిన పాన్ ఇండియా సినిమాలన్నీ వరుసగా దెబ్బతింటూ వచ్చాయి. దురదృష్టం ఏమిటంటే ఫ్లాప్ ప్రభావం ఎప్పుడూ కూడా మొదటగా మోసేది హీరోయిన్సే. ఒక పాటలో మెరిసినా వాళ్లు ఫ్లాప్ కి బాధితులు కావలసిందే. అలాగే పూజ విషయంలో కూడా ఫ్లాప్ సినిమాల కారణంగా ఆమె కెరియర్ ప్రభావితమైంది. టాలీవుడ్ వైపు నుంచి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఆమె పేరు వినిపించినప్పటికీ, చివరికి తెరపైకి శ్రీలీల వచ్చింది.

పూజ హెగ్డేకి టాలీవుడ్ వైపు నుంచి గ్యాప్ పెరగడంతో, మళ్లీ ఆమెను తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి బన్నీ జోడీగా మెరవనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో ఆమె బన్నీతో ‘దువ్వాడ జగన్నాథం’ .. ‘ అల వైకుంఠపురములో’ చేసిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ తరువాత బన్నీతో చేయడానికి త్రివిక్రమ్ .. బోయపాటి .. అట్లీ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అట్లీ కుమార్ తోనే ముందుగా సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో బన్నీ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసమే పూజను సంప్రదిస్తున్నారట. ఆమె చేయడం దాదాపుగా ఖరారైనట్టేనని అంటున్నారు .. చూడాలిమరి ఏం జరుగుతుందో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular