Friday, October 18, 2024
HomeTrending Newsదళితబంధు దేశానికి దిక్సూచి-కెసిఆర్

దళితబంధు దేశానికి దిక్సూచి-కెసిఆర్

దళిత బంధు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత బంధు ప్రభుత్వం పథకం మాదిరి కాకుండా మహోద్యమమంగా ముందుకు తీసుకువేళతమన్నారు. హుజురాబాద్ లో దళితబందు పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి దళిత బంధు లక్ష్యాలని వివరించారు. ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన సిఎం కెసిఆర్ దళిత బంధు లక్ష్యాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గర నుంచి వివిధ పథకాల అమలు వరకు అనేక విమర్శలు చేశారన్నారు. కరెంటు, కాళేశ్వరం నుంచి రైతుబందు వరకు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నీ సుసాధ్యం చేసి చూపించాం. తెలంగాణ అంటే మిగతా పార్టీలకు రాజకీయ క్రీడా. తెరాస కు మాత్రం రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం.

కొత్త ఇంటి సంసారం చక్కదిద్దినట్టు ఒక్కో పథకం అమలు చేస్తున్నాం. దళితబందు ఏడాది క్రితమే అమలులోకి రావలసి ఉండగా కరోన వళ్ళ ఆలస్యం అయిందన్నారు. దళిత బందు ఇస్తే కొందరు విమర్శలు చేస్తున్నారు. తీసుకునే వాళ్లకు ఇచ్చేవాల్లకు లేని కష్టం చూసే వాళ్లకు ఎందుకని సిఎం ప్రశ్నించారు. నూటికి నూరు శాతం దళితబందు అమలు చేసి తీరుతాం.

హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో సుమారు 20 వేల కుటుంబాలు ఉన్నాయి. దళితులకు ఈ రోజు డబ్బులు ఇవ్వటం లేదు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి మరో రెండు నెలల్లో దళిత బంధు అందించి తీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. దళితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తుందన్నారు. అయితే ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వాళ్ళు దళిత బంధు చివరగా ఇస్తామని వివరించారు. అందరికి ఇచ్చే బాధ్యత నాది అని కెసిఆర్ భరోసా ఇచ్చారు.

దళితబంధుకు బ్యాంకులతో సంబంధం లేదు. కిస్తీలు కట్టే పనిలేదు. ఎవరికీ తిరిగి ఇచ్చే అవసరం లేదని కెసిఆర్ వివరించారు. అయితే అందరు ఒకే రకం పనులు ఎంచుకుంతే నష్టపోతారని సిఎం హెచ్చరించారు. వివిధ రకాల పనులు చేపడితే అందరికి మేలు జరుగుతుందన్నారు. దళితులు దరిద్రులు కాదని ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ముందుకు వెళ్లాలన్నారు. దళితబంధు తీసుకున్న వారు వాటిని ఏ ప్రాంతంలో అయినా వినియోగించుకోవచ్చన్నారు.

ఫెర్టిలైజర్, మెడికల్ షాపులతో పాటు వైన్ షాపులు పెట్టేందుకు రిజర్వేషన్లు అమలులోకి తీసుకోస్తామన్నారు. ప్రభుత్వానికి అవసరమైన వస్తువులు తయారు చేసి సరఫరా చేయాలన్నారు. దళితబందు ఓ సువర్ణ అవకాశమని, ఇది భారతదేశానికి దిక్సూచి కావాలన్నారు.

రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలకు వర్తింపచేసినా కేవలం లక్ష 70 వేల కోట్లు మాత్రమె అవుతుందన్నారు. దళితబందు పర్యవేక్షణ కోసం ఐ.ఏ.ఎస్ అధికారి రాహుల్ బొజ్జను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకుంటున్నాం. గతంలో కరువు తెలంగాణ ఉండగా ఈ రోజు దేశానికి ధాన్యాగారంగా మారిందన్నారు. ఎన్నికల్లో గెలిచి నేను కాకపోతే మరొకరు వస్తారని ఎవరు వచ్చినా పతకాలు ఎత్తివేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాని సిఎం వెల్లడించారు.

దళితబందు పథకం తీసుకున్నంత మాత్రాన రేషన్ కార్డు, ఇతర పథకాలు రద్దుకావని సిఎం స్పష్టం చేశారు. దళిత బంధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నారు. ప్రతి లబ్దిదారుని నుంచి పదివేలు తీసుకుని దానికి ప్రభుత్వం కూడా మరో పదివేలు కలిపి రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. దళిత రక్షణ నిధి పర్వేక్షణ కోసం మేధావులతో కమిటీ ఏర్పాటు చేస్తాం. భారతదేశ చరిత్రలో మొదటిసారి రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు.

దళితులు బాగుపడనంత కాలం దేశంలో వెనుకబాటు ఉంటుందన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో దళితబందు అమలవుతుందని కెసిఆర్ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్