Friday, September 20, 2024
HomeTrending Newsదేవినేని ఉమాకు నిరాశ - సోమిరెడ్డికి ఓకే : టిడిపి మూడో జాబితా

దేవినేని ఉమాకు నిరాశ – సోమిరెడ్డికి ఓకే : టిడిపి మూడో జాబితా

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ నిరాకరించారు. ఇటీవలే టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ కేటాయించారు. 11 అసెంబ్లీ, 13 మంది లోక్ సభ అభ్యర్ధులతో కూడిన జాబితాను నేడు టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు.

మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను  పొత్తులో భాగంగా 144 సీట్లకు పోటీ చేస్తోన్న టిడిపి నేటితో కలిపి 139 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. 17 లోక్ సభ స్థానాలకు గాను 13 పేర్లను నేడు వెల్లడించారు. మరో నాలుగు లోక్ సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి ఉంది.

అసెంబ్లీ అభ్యర్ధులు:

  1. పలాస  – గౌతు శిరీష
  2. పాతపట్నం – మామిడి గోవింద రావు
  3. శ్రీకాకుళం – గొండు శంకర్
  4. శృంగవరపు కోట – కొల్ల లలిత కుమారి
  5. అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు
  6. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వర రావు
  7. పెనమలూరు – బోడె ప్రసాద్
  8. మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్
  9. నరసరావుపేట – చదలవాడ అరవిందబాబు
  10. చీరాల – మాలకొండయ్య
  11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

లోక్ సభ అభ్యర్ధులు

  1. శ్రీకాకుళం  – కింజరాపు రామ్మోహన్ నాయుడు
  2. విశాఖపట్నం – ముతుకుమిల్లి భరత్
  3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
  4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
  5. విజయవాడ – కేశినేని చిన్ని
  6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
  7. బాపట్ల – టి. కృష్ణప్రసాద్
  8. నరసరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు
  9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  10. కర్నూలు – బస్తిపాటి నాగరాజు
  11. చిత్తూరు – దగ్గుమల్ల ప్రసాదరావు
  12. నంద్యాల – బైరెడ్డి శబరి
  13. హిందూపూర్ – బీకే పార్థసారథి
RELATED ARTICLES

Most Popular

న్యూస్