Monday, March 9, 2026
HomeTrending Newsపెన్షన్ల పంపిణీలో రాజకీయ కుట్ర: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీలో రాజకీయ కుట్ర: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీ విషయంలో తమపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ప్రజలు ఈ కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశారు.

“వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డిఎన్ఎలోనే ఉంది. పెన్షన్ లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదు అని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదు. పెన్షన్ ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్దులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదు. ప్రజలారా కుట్రలను చేదించండి….దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి. అధికారం లోకి రాగానే పెన్షన్ రూ.4000 కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం” అంటూ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular