తాము అధికారంలోకి రాగానే ఇసుకాసురులను జైల్లో పెట్టి ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. తమ హయంలో ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు ఐదువేల రూపాయలుగా ఉందని… ఇసుక మాఫియాను సృష్టించి దోచుకుంటున్నారని… వీళ్ళ అరాచకం చూస్తుంటే కడుపు రగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. తాపీ మేస్త్రీలు అంతా కలిసి వైసీపీ ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసి సమాధి కట్టాలని కోరారు.
యువకులకు 40శాతం సీట్లు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు సీటు ఇచ్చామని, కొమ్మాలపాటి శ్రీధర్ ను ఎమ్మెల్సీగా చేస్తామని…. తను ఎప్పుడుగూ ముందుగా హామీలు ఇవ్వనని… కానీ శ్రీధర్ విషయంలో మాత్రం ముందుగానే చెబుతున్నానై బాబు ప్రకటించారు. ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ ను, ఎంపిగా లావు శ్రీకృష్ణ దేవరాయలును గెలిపించాలని…. వీరిద్దరితో పాటు ఎమ్మెల్సీగా శ్రీధర్ …. ముగ్గురూ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని భరోసా ఇచ్చారు.
బాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- కేంద్రంలో మళ్ళీ రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే
- రాష్ట్ర భవిష్యత్ కోసమే ఎన్డీయేలో చేరి కూటమిగా వస్తున్నాం
- వైసీపీ హయంలో మైనార్టీలకు అన్యాయం జరిగింది
- కూటమిలో మైనార్టీలకు అన్యాయం జరగనివ్వం
- టిడిపి, జనసేన, బిజెపి కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం
- రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యం అంతా కదిలింది
- రాముడు దేవుడు అయినప్పటికీ వానరులతో కలిసి పోరాడారు
- రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బిజెపితో కలిసి పోటీ
- సిఎం జగన్ శవ రాజకీయాలతో వస్తుంటే… తాను నాయకులతో వస్తున్నా
- ఐదేళ్ళ జగన్ పాలన పీడకల
- తన ఆదాయంకోసం, స్వార్ధం కోసం నిండు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు జగన్
- పెదకూరపాడు అంటే అమరావతి
- ఆ తర్వాత నేను అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టాం
- కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గం అంటే ఇసుక బకాసురుడు శంకర్ రావు గుర్తుకొస్తారు
- జగన్ ఐదేళ్ళ పాలనలో అనేక అరాచకాలు జరిగాయి
- అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు
- కులాలు, మతాల పేరుతో అమరావతిని చంపిన వ్యక్తి జగన్
- ఎమ్మెల్యే శంకర్ రావు ఒక్కరోజైనా అమరావతి కోసం మాట్లాడారా?
- అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్స్ ను పూర్తిగా నిర్మూలించే బాధ్యత నాదే.