Monday, March 31, 2025
HomeTrending Newsఉమ్మడి కృష్ణాజిల్లాలోకి జగన్ యాత్ర - వారధిపై ఘన స్వాగతం

ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి జగన్ యాత్ర – వారధిపై ఘన స్వాగతం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. నేటి ఉదయం గుంటూరు జిల్లాలో మొదలు కాగా, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. భోజన విరామం అనంతరం కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది.

విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపి అభ్యర్ధి కేశినేని నాని, విజయవాడ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్ లతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్