Saturday, November 23, 2024
HomeTrending Newsనిన్న జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే: సజ్జల

నిన్న జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే: సజ్జల

సిఎం జగన్ పై జరిగింది కోల్డ్‌బ్లడెడ్‌ ప్రీ ప్లాన్డ్‌ ఎటాక్  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ఆయన ధాటికి ధీటుగా నిలువలేక చేసిన పిరికిపంద చర్య అని అభివర్ణించిన సజ్జల అదృష్టం బాగుండి, దేవుడి దయతో జగన్‌ బయటపడ్డారని వ్యక్యానించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మట్లాడారు. వాటిలో ముఖ్యాంశాలు”

  • కడుపునకు అన్నం తినేవాడెవడైనా డ్రామా అంటూ మాట్లాడగలరా?
  • ఎవరైనా తనకు తానుగా సెన్సిటివ్‌ పార్ట్‌పై దాడి చేయించుకుంటారా?
  • అసలు జనం ముఖంపై ఉమ్మేస్తారని కూడా వీరికి అనిపించదా?
  • అలాంటి నటనకు పెట్టింది పేరు చంద్రబాబే. అతను ప్రూవ్డ్ నటుడు.
  • అలిపిరి సంఘటన నటన అని ఎవరైనా అన్నారా?
  • ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు నీకు సంఘీభావంగా తిరుపతిలో మౌనదీక్ష చేశారు
  • ఆనాడు సింపతీ కోసం మూడు నెలలు ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసింది బాబే.
  • వీళ్లు భుజాలు తడుముకోవడం చూస్తే వీళ్లే చేయించి ఉంటారని ఖచ్చితంగా భావించాల్సి వస్తోంది.
  • జగన్‌ గారి బస్సు యాత్ర వల్ల ఇబ్బంది పడింది టీడీపీ అండ్‌ కో మాత్రమే.
  • కోస్తాలోనూ జగన్‌ గారికి బ్రహ్మరథం పట్టడం చూసి ఓర్వలేకపోతున్నారు.
  • అందుకే ఈ మధ్య చంద్రబాబు కార్యకర్తలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు.
  • ఇలాంటి దాడులకు బెదిరి వెనక్కు తగ్గే వ్యక్తి జగన్‌ గారు కాదు.
  • రేపటి నుంచి యాత్ర యథావిధిగా కొనసాగుతుంది.
  • ఈ సంఘటనతో వీళ్లకు రాజకీయాల్లోనే ఉండే అర్హతే లేదని ప్రజలు డిసైడ్‌ చేసుకున్నారు.
  • ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.
  •  వైఎస్‌ జగన్‌ గారి బస్సు యాత్ర జన నీరాజనాల మధ్య ఇడుపులపాయలో మొదలై నిన్న ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించింది.
  •  నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా యాత్ర సాగుతోంది. ప్రజలు తండోపతండాలుగా రావడంతో చాలా ఆలస్యంగా యాత్ర సాగింది.
  • ఈ మధ్యలో అనూహ్యంగా జరగరాని దారుణం ఒకటి జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డి గారిపై దాడి జరిగింది.
  • మొదట దాని సీరియస్‌నెస్‌ తెలియలేదు. పొరపాటున తగిలి ఉంటుందని అనుకున్నాం.
  • తగలడం కూడా చాలా సెన్సిటివ్‌ పార్ట్‌కు దగ్గరగా తగిలింది.
  • ఈ దారుణమైన ఘటనను వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తోంది.
  • ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మమేకం అయి తిరగడం నాయకుడి ప్రధాన లక్షణం అయితే..దానికి ధీటుగా నిలువలేక పిరికిపందలు చేసే చర్యగా మేం భావిస్తున్నాం.
  • జగన్‌ గారికి గాయం లోతుగా తగిలింది. కుట్లు పడ్డాయి. ఆర్ధగంట తర్వాత అంతా స్వెల్లింగ్‌ వచ్చింది.
  • ఆ రాయి ఒక ఇంచ్‌ కిందికి వచ్చి ఉంటే కంటికి తగిలి కనుచూపు పోయేది.
  • అలా కాకుండా కణతకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది.
  • ఆ వస్తువు పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌ కంటికి కూడా తగిలింది.
  • జగన్‌ గారికి తగిలిన రాయి తగిలి, పక్కనే ఉన్న వ్యక్తి కూడా తగిలింది అంటే ఎంత ఫోర్స్‌తో వచ్చి ఉండాలి?
  • కింద నుంచి ఎవరో విసిరితే జరిగింది కాదు. బలంగా ఏదో ఒక దాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి.
  • అది క్యాట్‌బాల్‌ అయినా ఉండొచ్చు..ఎయిర్‌ గన్‌ అయినా అయ్యి ఉండొచ్చు.
  • ఏదైనా బలమైన వస్తువుతో దీన్ని ప్రయోగించి ఉంటారని అనిపిస్తోంది.
  • ఎవరో తుంటరి వాళ్లు ఇంత పథకం ప్రకారం చేసి ఉండటానికి అవకాశం లేదు.
  • నేరుగా వచ్చి తగలగడం, తగిలిన స్పాట్‌ చూస్తే భయం వేస్తోంది.
  • రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ బాధ పడ్డారు..ఆందోళన చెందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్