Saturday, March 14, 2026
Homeసినిమావిక్రమ్ అంటే ఓ సాహసం .. విక్రమ్ అంటే ఓ ప్రయోగం!

విక్రమ్ అంటే ఓ సాహసం .. విక్రమ్ అంటే ఓ ప్రయోగం!

కోలీవుడ్ లో వైవిధ్యభరితమైన కథలను అంగీకరించడంలో .. పాత్రలకి తగిన విధంగా తెరపై కొత్తగా కనిపించడానికి ట్రై చేయడంలో కమల్ తరువాత వినిపించే పేరు విక్రమ్. మొదటి నుంచి కూడా విక్రమ్ విభిన్నమైన పాత్రలు చేయడానికీ .. విలక్షణంగా కనిపించడానికి ఆసక్తిని చూపుతూ వచ్చారు. సాధారణంగా హీరో అంటే హ్యాండ్సమ్ గా కనిపించాలని అనుకుంటారు. తెరపై బక్కచిక్కిపోయి కనిపించడానికీ .. రియల్ గా గుండుతో కనిపించడానికి చాలామంది హీరోలు ఒప్పుకోరు. అలాంటి సమయంలోనే ధైర్యంగా ఆ పాత్రలు చేసిన హీరో విక్రమ్.

ఒక వైపున కమల్ .. మరో వైపున రజనీకాంత్ వంటి స్టార్ హీరోల జోరు సాగుతున్న సమయంలో, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. అలాంటి పరిస్థితులలో విక్రమ్ ఎక్కువగా ప్రయోగాలనే ఆశ్రయించారు. నిజానికి అది చాలా సాహసోపేతమైన నిర్ణయం కూడా. చాలా కాలం పాటు ఆయన కెరియర్ ను అలాంటి సినిమాలే రక్షిస్తూ వచ్చాయి.  అయితే ఆ తరువాత చేసిన ప్రయోగాలు అంతగా కలిసిరాకపోయినా విక్రమ్ తన ప్రయత్నాలను మాత్రం ఆపకుండానే ముందుకు వెళ్లారు.

ఫలించినప్పుడే ప్రయోగానికి ఒక ప్రయోజనం ఉంటుంది. కానీ చాలా కాలంగా విక్రమ్ చేస్తూ వచ్చిన ప్రయోగాలు థియేటర్ల దగ్గర విఫలమవుతూ వచ్చాయి. అయినా ఆయన తన నిర్ణయాలను మార్చుకోలేదు. ఆయన నుంచి రానున్న ‘తంగలాన్’ ఒక ప్రయోగమే. లుక్ పరంగా విక్రమ్ పతాకస్థాయికి వెళ్లిపోయారనే విషయాన్ని పోస్టర్లే చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ‘ వీర ధీర శూరన్’  అంటూ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 62వ సినిమా. ఫస్టులుక్ పోస్టర్ తోనే ఆయన అంచనాలు పెంచేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular